IPL 2024: మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్..

Gulbadin Naib Replacement For Mitchell Marsh: కుడి స్నాయువు గాయం కారణంగా మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన తర్వాత మార్ష్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం నాడు మరో ప్లేయర్‌ను తీసుకున్నట్లు ప్రకటించింది.

IPL 2024: మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్..
Gulbadin Naib

Updated on: Apr 25, 2024 | 10:32 PM

Gulbadin Naib Replacement For Mitchell Marsh: కుడి స్నాయువు గాయం కారణంగా మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన తర్వాత మార్ష్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం నాడు మరో ప్లేయర్‌ను తీసుకున్నట్లు ప్రకటించింది. మిగిలిన IPL 2024 కోసం మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్‌ను ఎంపిక చేసింది.

ఈ మేరకు డీసీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. “నేను ఈ రోజు అతనితో మాట్లాడాను. గాయాన్ని అధిగమించడానికి మొదటి ఆలోచన కంటే కొంచెం ఎక్కువ సమయం ఉంది. ప్రపంచ కప్ సమస్యగా ఉంటుందని నేను అనుకోను. కానీ, అతను మా కోసం ఇక్కడకు తిరిగి రావడాన్ని చూడటం చాలా కష్టమైన పని’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఈ ఏడాది కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. కేవలం ఒక వికెట్ తీయడం ద్వారా 61 పరుగులు చేశాడు.

సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన నైబ్ ఆఫ్ఘనిస్తాన్ తరపున 65 టీ20లు, 82 వన్డేలు ఆడాడు. రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో అతను జట్టులోకి వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నాయబ్‌ తొలిసారి అడుగు పెడుతుననాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, పృథ్వీ షా, షాయ్ హోప్, ప్రవీణ్ దూబే, రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్, కుమార్ కుషాగ్రా, యష్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, స్వస్తిక్ చికారా, ఝే రిచర్డ్‌సన్, రికీ భుయ్, లిజాద్ విలియమ్స్, ఇషాంత్ శర్మ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..