AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepti Sharma: వేలంలో బంపరాఫర్‌ కొట్టేసిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఏకంగా అన్ని కోట్లా?

టీమిండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బంపరాఫర్‌ కొట్టేసింది. గత కొన్నేళ్లుగా అటు బంతి, ఇటు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తోన్న ఈ స్టార్‌ ప్లేయర్‌ను యూపీ వారియర్స్‌ ఏకంగా రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది.

Deepti Sharma: వేలంలో బంపరాఫర్‌ కొట్టేసిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఏకంగా అన్ని కోట్లా?
Deepti Sharma
Basha Shek
|

Updated on: Feb 13, 2023 | 4:17 PM

Share

టీమిండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బంపరాఫర్‌ కొట్టేసింది. గత కొన్నేళ్లుగా అటు బంతి, ఇటు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తోన్న ఈ స్టార్‌ ప్లేయర్‌ను యూపీ వారియర్స్‌ ఏకంగా రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది.  వేలంలో దీప్తి శర్మను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ.2.6 కోట్లకు దీప్తి శర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది.   కాగా 25 ఏళ్ల దీప్తి శర్మ బౌలింగ్‌తో పాటు బ్యాటుతోనూ రాణించడంతో మేటి ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందింది. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న దీప్తి శర్మ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 25 ఏళ్ల ఈ భారత ప్లేయర్ బౌలింగ్‌తో పాటు బ్యాటుతోనూ రాణించడంతో ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందింది. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో  కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు 85 టీ-20 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 6.14 ఎకానమీ రేటుతో 92 వికెట్లు పడగొట్టింది. గత మూడు నెలల్లో 16 మ్యాచ్‌ల్లో 5.89 ఎకానమీ రేటుతో 24 వికెట్లు పడగొట్టింది.  ఇక ఆదివారం (ఫిబ్రవరి 12) పాక్‌తో మ్యాచ్‌ ద్వారా ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది దీప్తిశర్మ. అదేంటంటే.. వరుసగా 50కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో టీమిండియా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.  కాగా పురుషుల క్రికెట్‌లో దిగ్గజాలుగా చెప్పుకునే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు ఎవరూ ఈ రికార్డును అందుకోలేకపోవడం గమనార్హం.

మన్కడింగ్ ఔట్ తో వెలుగులోకి..

కాగా గతేడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను దీప్తి శర్మ మన్కడింగ్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే ఆమె ఔట్‌ చేసినప్పటికీ కొందరు మాత్రం దీప్తి తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చేతుల్లోకొచ్చిన మ్యాచ్‌ చేజారిపోవడంపై సహించలేని బ్రిటిష్ మీడియా ఈ ఘటనపై రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో దీప్తి శర్మకు కూడా పలువురి మద్దతు లభించింది. నిబంధనలకు అనుగుణంగానే ఆమె రనౌట్‌ చేసిందంటూ మాజీ క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు అండగా నిలబడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!