DC vs SRH Highlights, IPL 2023: హైదరాబాద్ ఉత్కంఠ విజయం.. 9 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ..
అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Delhi Capitals vs Sunrisers Hyderabad Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్‌లో 40వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఢిల్లీపై వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్‌కు ఇదే తొలి విజయం. సొంత మైదానంలో ఢిల్లీని ఓడించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది మూడో విజయం కాగా, ఢిల్లీకిది ఆరో ఓటమి.
అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.
IPL 40వ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లూ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇక్కడ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10వ స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రియమ్ గార్గ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. ప్రియమ్ అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Aiden Anna won the ? and opted to bat ?
Samad & Akeal included in the playing XI ? pic.twitter.com/ZRTz1dgl2x
— SunRisers Hyderabad (@SunRisers) April 29, 2023
LIVE Cricket Score & Updates
-
హైదరాబాద్ విజయం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్‌లో 40వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 198 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
-
విజయానికి 24 బంతుల్లో 57 పరుగులు..
ఢిల్లీ 16 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
-
-
మూడో వికెట్ డౌన్..
ఢిల్లీ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్ ఉన్నాడు. మిచెల్ మార్ష్ మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
-
ముగిసిన పవర్ ప్లే.. ఢిల్లీ స్కోరెంతంటే?
198 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ వార్నర్ మొదటి ఓవర్ లోనే ఔట్ కావడంతో ఫిలిప్ సాల్ట్ (20 బంతుల్లో 36), మిచెల్ మార్ష్ (14 బంతుల్లో 20) వికెట్ కాపాడుకుంటూ ఆడుతున్నారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 57/1. ఢిల్లీ విజయానికి 84 బంతుల్లో 141 పరుగులు అవసరం.
-
ఢిల్లీకి ధమ్కీ ఇచ్చిన భువనేశ్వర్.. ఫస్ట్ వికెట్ డౌన్
198 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. మొదటి ఓవర్ రెండో బంతికే వార్నర్‌ను బౌల్డ్ చేసి హైదరాబాద్ కు శుభారంభం అందించాడు.
-
-
అదరగొట్టిన అభిషేక్ శర్మ, క్లాసెన్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67, 12 ఫోర్లు, ఒక సిక్స్), క్లాసెన్ (27 బంతుల్లో 53, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించారు.
? class performance with a ? Klaas fifty to finish ? pic.twitter.com/XK01YcB09D
— SunRisers Hyderabad (@SunRisers) April 29, 2023
-
నిలకడగా హైదరాబాద్ బ్యాటింగ్.. క్రీజులో ఎవరున్నారంటే?
ఢిల్లీ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ ఆత్మరక్షణ ధోరణితో బ్యాటింగ్ చేస్తోంది. 16 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 152/5. క్లాసెన్ (17 బంతుల్లో 33), సమద్ (17 బంతుల్లో 20) క్రీజులో ఉన్నారు.
-
అభిషేక్ శర్మ దూకుడు
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అతనికి తోడుగా మర్కరమ్ (6) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు 8 ఓవర్లు ముగిసే సరికి 86/2
In his zone, ?? usual! ?
??eauty ? pic.twitter.com/XFzNFFpJRy
— SunRisers Hyderabad (@SunRisers) April 29, 2023
-
హైదరాబాద్ కు వరుస షాక్ లు..
హైదరాబాద్‌కు తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) మళ్లీ నిరాశపర్చాడు . ఇషాంత్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఆడబోయి వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ చేతికి చిక్కాడు. ఆతర్వాత రాహుల్ త్రిపాఠి (10) కూడా వెంటనే ఔటయ్యాడు. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ స్కోరు 5.2 ఓవర్లు ముగిసే సరికి 50/2
-
ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే..
DC
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ ( వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిప్పల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్కియా, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్
SRH
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకిల్ హుస్సేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.
Published On - Apr 29,2023 7:43 PM