AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs RR Highlights, IPL 2022: ఢిల్లీ 20 ఓవర్లలో 207/8.. 15 పరుగుల తేడాతో రాజస్తాన్‌ విజయం

Delhi Capitals vs Rajasthan Royals Highlights: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రెండు బలమైన జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై సర్వత్ర ఆసక్తినెలకొంది...

DC vs RR Highlights, IPL 2022: ఢిల్లీ 20 ఓవర్లలో 207/8.. 15 పరుగుల తేడాతో రాజస్తాన్‌ విజయం
Ipl Dc Vs Rr
Narender Vaitla
| Edited By: uppula Raju|

Updated on: Apr 23, 2022 | 12:22 AM

Share

Delhi Capitals vs Rajasthan Royals Highlights: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ పై చేయి సాధించింది. 15 పరుగుల తేడాతో విజయ దుందుబి మోగించింది. ఢిల్లీ కేవలం 20 ఓవరల్లో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులకే పరిమితమైంది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలో బాగానే ఆడింది. రిషభ్‌ పంత్ 44 పరుగులు, పృథ్వీ షా 37 పరుగులు, లలిత్‌ యాదవ్ 37 పరుగులు, డేవిడ్‌ వార్నర్ 28 పరుగులు రాణించారు. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్స్‌.. ఢిల్లీ క్యాపిటల్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు సాధించారు. దీంతో ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు నెలకొల్పారు. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, పడిక్కల్‌ రాజస్థాన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. బట్లర్‌ కేవలం 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు సాధించాడు. ఇక పడిక్కల్‌ 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక చివర్లో క్రీజులోకి వచ్చి సంజూ శాంసన్‌ కేవలం 19 బంతుల్లోనే 46 పరుగులతో జట్టు స్కోర్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.

Key Events

సమ ఉజ్జీలు..

ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్​కోచ్​రికీ పాంటింగ్​కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో పాంటింగ్ ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఈ మ్యాచ్‌కు పాంటింగ్ దూరం కానున్నాడు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 22 Apr 2022 11:38 PM (IST)

    ఢిల్లీ 20 ఓవర్లలో 207/8.. 15 పరుగుల తేడాతో రాజస్తాన్‌ విజయం

    ఢిల్లీ 20 ఓవరల్లో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 36 పరుగులు కావాలి. రోవ్‌మన్‌ పావెల్ 3 బంతుల్లో వరుసగా 3 సిక్స్‌లు బాదాడు. విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ గెలిపించలేకపోయాడు. రాజస్థాన్‌ బౌలర్లలో రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 3, రవిచంద్రన్ అశ్విన్ 2, చాహల్‌1, మెక్ కాయ్‌ 1 వికెట్‌ సాధించారు.

  • 22 Apr 2022 11:28 PM (IST)

    రోవ్‌మన్‌ పావెల్ హ్యాట్రిక్‌ సిక్స్‌

    రోవ్‌మన్‌ పావెల్ 3 బంతుల్లో వరుసగా 3 సిక్స్‌లు బాదాడు. విజయంపై ఆశలు రేకెత్తించాడు. విజయానికి ఇంకా 3 బంతుల్లో 18 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 11:22 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ ఏడో వికెట్‌ కోల్పోయింది. లలిత్‌ యాదవ్ 37 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో సామ్సన్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 18.3 ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 9 బంతుల్లో 36 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 11:02 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ ఆరో వికెట్‌ కోల్పోయింది. శార్దుల్ ఠాగూర్‌ 7 పరుగుల వద్ద రన్‌ ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 15.3 ఓవరల్లో ఆరు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 27 బంతుల్లో 66 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 11:00 PM (IST)

    150 పరుగులు దాటిన ఢిల్లీ

    ఢిల్లీ 15.1 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. క్రీజులో శార్దుల్ ఠాగూర్ 3 పరుగులు, లలిత్‌యాదవ్ 25 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 29 బంతుల్లో పరుగులు 67 చేయాల్సి ఉంది. రాజస్తాన్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 2, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్‌, చాహల్‌ 1 వికెట్‌ సాధించారు.

  • 22 Apr 2022 10:58 PM (IST)

    15ఓవరల్లో ఢిల్లీ 149/5

    15 ఓవరల్లో ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. క్రీజులో లలిత్‌ యాదవ్‌ 24 పరుగులు, శార్దుల్‌ ఠాగూర్ 3 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 30 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్తాన్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 2, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్‌, చాహల్‌ 1 వికెట్‌ సాధించారు.

  • 22 Apr 2022 10:49 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ ఐదో వికెట్‌ కోల్పోయింది. అక్సర్ పటేల్ 1 పరుగుకే ఔటయ్యాడు. చాహల్‌ బౌలింగ్‌లో బోల్డ్‌ అయ్యాడు. దీంతో ఢిల్లీ 13 ఓవరల్లో ఐదు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 42 బంతుల్లో 92 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 10:43 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. రిషబ్‌ పంత్‌ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో పాడిక్కల్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 11.4 ఓవరల్లో నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 50 బంతుల్లో 99 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 10:34 PM (IST)

    100 పరుగులు దాటిన ఢిల్లీ

    ఢిల్లీ 10.2 ఓవరల్లో 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. క్రీజులో లలిత్‌ యాదవ్‌ 0 పరుగులు, రిషబ్‌ పంత్ 31 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 57 బంతుల్లో 116 పరుగులు చేయాల్సి ఉంది.

  • 22 Apr 2022 10:33 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. ఫృధ్వీషా 37 పరుగుల వద్ద ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో బోల్ట్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 9.6 ఓవరల్లో మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 60 బంతుల్లో 124 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 10:08 PM (IST)

    50 పరుగులు దాటిన ఢిల్లీ

    ఢిల్లీ 5.4 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో ఫృధ్వీషా 20 పరుగులు, రిషబ్‌ పంత్ 6 పరుగులు ఆడుతున్నారు. విజయానికి ఇంకా 84 బంతుల్లో 168 పరుగులు చేయాల్సి ఉంది.

  • 22 Apr 2022 10:05 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. సర్పరాజ్‌ ఖాన్ 1 పరుగుకే ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 5.1 ఓవరల్లో రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 89 బంతుల్లో 175 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 10:01 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ మొదటి వికెట్‌ కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్ 28 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రసిద్ద్‌ బౌలింగ్‌లో సామ్సన్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 4.3 ఓవరల్లో ఒక వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 91 బంతుల్లో 179 పరుగులు చేయాలి.

  • 22 Apr 2022 09:30 PM (IST)

    భారీ విజయ లక్ష్యం..

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్స్‌.. ఢిల్లీ క్యాపిటల్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు సాధించారు. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక స్కోరును నెలకొల్పింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, పడిక్కల్‌ రాజస్థాన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. బట్లర్‌ కేవలం 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు సాధించాడు. ఇక పడిక్కల్‌ 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక చివర్లో క్రీజులోకి వచ్చి సంజూ శాంసన్‌ కేవలం 19 బంతుల్లోనే 46 పరుగులతో జట్టు స్కోర్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. మరి రాజస్థాన్‌ ఇచ్చిన భారీ స్కోర్‌ను ఢిల్లీ చేదిస్తుందో చూడాలి.

  • 22 Apr 2022 09:17 PM (IST)

    బట్లర్ అవుట్‌..

    తన విద్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపిన బట్లర్‌ అవుట్‌ అయ్యాడు. కేవలం 65 బంతుల్లోనే 116 పరుగులు చేసిన బట్లర్‌ ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 22 Apr 2022 09:09 PM (IST)

    భారీ స్కోర్ దిశగా అడుగులు..

    రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతోంది. 18 ఓవర్లు ముగిసే సమయానికి 188 పరగుల వద్ద కొనసాగుతోంది. ఇక పడిక్కల్‌ అవుట్‌ అయిన తర్వాత క్రీజులోకి వచ్చి సంజూ శాంసన్‌ కూడా దుమ్మురేపుతున్నాడు. కేవలం 13 బంతుల్లోనే 28 పరుగులతో జట్టు స్కోర్‌ను పెంచేస్తున్నాడు.

  • 22 Apr 2022 08:57 PM (IST)

    సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్‌..

    బట్లర్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 57 బంతుల్లోనే 8 సిక్సర్లు, 8 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక 16 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ స్కోర్‌ 158 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 22 Apr 2022 08:50 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్‌..

    రాజస్థాన్‌ రాయల్స్‌ ఎట్టకేలకు తొలి వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో దేవదత్‌ పడిక్కల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. పడిక్కల్‌ 35 బంతుల్లో 54 పరుగులు సాధించాడు.

  • 22 Apr 2022 08:40 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్‌..

    బట్లర్‌ జోరుకు పడిక్కల్‌ కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే దేవదత్‌ పడిక్కల్ కేవలం 31 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. ఇక బట్లర్‌ 83 పరుగులతో దూసుకుపోతున్నాడు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది.

  • 22 Apr 2022 08:36 PM (IST)

    దూసుకుపోతున్న రాజస్థాన్‌ స్కోర్‌..

    రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్స్‌ దంచి కొడుతున్నారు. ఒక్క వికెట్‌ కోల్పోకుండా భారీ స్కోర్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 128 పరుగులతో దూసుకుపోతోంది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సమయానికి బట్లర్‌ (77), పడిక్కల్‌ (49) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 22 Apr 2022 08:15 PM (IST)

    పెరుగుతోన్న స్కోర్ బోర్డ్‌..

    రాజస్థాన్‌ స్కోర్‌ బోర్డ్‌ క్రమంగా పెరుగుతోంది. 9 ఓవర్లు ముగిసే సమయానికి 78 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌ (41), పడిక్కల్‌ (35) పరుగులతో ఉన్నారు.

  • 22 Apr 2022 08:03 PM (IST)

    రాజస్థాన్‌కు శుభారంభం..

    రాజస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. వికెట్‌ను కాపాడుతూనే జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే 6 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 44 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌ (26), దేవదత్‌ పడిక్కల్‌ (17) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 22 Apr 2022 07:29 PM (IST)

    ఇరు జట్ల ప్లేయర్స్‌..

    రాజస్థాన్ రాయల్స్.. సంజు శాంసన్ (కెప్టెన్-కీపర్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.

    ఢిల్లీ క్యాపిటల్స్‌.. రిషబ్ పంత్ (కెప్టెన్-కీపర్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.

  • 22 Apr 2022 07:07 PM (IST)

    టాస్‌ గెలిచిన ఢిల్లీ..

    ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. డ్యూ ఫ్యాక్టర్‌, పిచ్‌ చేజింగ్‌కు అనుకూలించడంతో ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మరి ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర ఫలితం ఇస్తుందో చూడాలి.

  • 22 Apr 2022 06:57 PM (IST)

    కరోనా కారణంగా పాంటింగ్ దూరం..

    ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్​కోచ్​రికీ పాంటింగ్​కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో పాంటింగ్ ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఈ మ్యాచ్‌కు పాంటింగ్ దూరం కానున్నాడు.

Published On - Apr 22,2022 6:40 PM