- Telugu News Photo Gallery CSK former Captain Ms dhoni IPL batting records king of 20th over Mumbai indians vs chennai super kings ipl 2022
IPL 2022: ధోనితో అట్లుంటది మరి.. 20వ ఓవర్ అంటే ప్రత్యర్థుల గుండె గుబేలే.. 40 ఏళ్ల వయసులోనూ దబిడదిబిడే..
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి అద్భుతమైన రికార్డు ఉంది. టీ20 క్రికెట్‌లో అతనికి 20వ ఓవర్లో బౌలింగ్ చేయడం కష్టం. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ కూడా ఈ విషయాన్ని గ్రహించింది.
Updated on: Apr 22, 2022 | 2:12 PM

ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ చివరి ఓవర్‌లో తన కంటే గొప్ప ఫినిషర్ లేడని మరోసారి నిరూపించాడు. సీఎస్‌కే మాజీ కెప్టెన్ అద్భుత ఆటతీరు కనబరుస్తూ.. చివరి నాలుగు బంతుల్లో 16 పరుగులు కొల్లగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ధోని 13 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఫినిషర్ పాత్రలో మరోసారి ఆయన పేరు మారుమోగిపోయింది.

ముంబై ఇండియన్స్‌పై 20వ ఓవర్‌లో ధోనీ 16 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. 20వ ఓవర్‌లో ధోనీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ అతను 121 బంతులు ఎదుర్కొని 323 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో 26 ఫోర్లు, 26 సిక్సర్లు బాదాడు. చివరి 20వ ఓవర్‌లో అతని స్ట్రైక్ రేట్ 266.94గా మారింది. ఇది అద్భుతమైనది.

మహేంద్ర సింగ్ ధోనీ 40 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నాడు. చాలా మంది ఇతర క్రికెటర్లు కూడా ఈ వయస్సు వరకు ఆడుతున్నారు. కానీ, ధోని రికార్డు అతనిని మిగతా వారి నుంచి వేరు చేస్తుంది. 40 ఏళ్ల తర్వాత ధోనీ కెరీర్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. అతని సగటు 32.83గా నిలిచింది. 30.36 సగటుతో క్రిస్ గేల్ రెండోస్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ (29.44), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (27.41), సచిన్ టెండూల్కర్ (23.43) పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.

ఐపీఎల్ 2022లో ధోనీ ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 60 సగటుతో 120 పరుగులు చేశాడు. నాలుగు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 131.86గా నిలిచింది. ఈ సీజన్‌లో ధోనీ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అతను ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో KKRపైనా ఇదే తరహాలో అదరగొట్టాడు. 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

IPL 2022 గురించి మాట్లాడుతూ, మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్‌లో మంచి ఫాంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో చివరి మూడు ఓవర్లలో 29 బంతులు ఆడి 74 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. చివరి మూడు ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ 255.2గా నిలిచింది. చివరి రెండు ఓవర్లు చూసిన తర్వాత ధోని స్ట్రైక్ రేట్ బాగా పెరుగుతుంది. ఈ సమయంలో, అతను 289.5 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.




