DC vs LSG Preview: లక్నోతో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. ఓడిపోతే ప్లే ఆఫ్స్‌కు దూరం.. తిరిగొచ్చిన రిషబ్ పంత్..

Delhi capitals vs Lucknow Super Giants, IPL 2024 Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 64వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మంగళవారం రాత్రి 7.30 గంటల నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఒక్క మ్యాచ్‌పైనే ఇరు జట్ల ప్లేఆఫ్ ఆశలు ఉన్నాయి. ఒక రకంగా ఢిల్లీకి ఇది వర్చువల్ సెమీఫైనల్.

DC vs LSG Preview: లక్నోతో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. ఓడిపోతే ప్లే ఆఫ్స్‌కు దూరం.. తిరిగొచ్చిన రిషబ్ పంత్..
Dc Vs Lsg Preview
Follow us

|

Updated on: May 14, 2024 | 9:21 AM

Delhi capitals vs Lucknow Super Giants IPL 2024 Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 64వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మంగళవారం రాత్రి 7.30 గంటల నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఒక్క మ్యాచ్‌పైనే ఇరు జట్ల ప్లేఆఫ్ ఆశలు ఉన్నాయి. ఒక రకంగా ఢిల్లీకి ఇది వర్చువల్ సెమీఫైనల్. ఢిల్లీకి ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే ప్లేఆఫ్ నుంచి దూరమవుతుంది.

ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. లక్నో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 6 గెలిచి, అదే సంఖ్యలో ఓడింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడింది. ఢిల్లీకి కూడా 12 పాయింట్లు ఉన్నాయి. కానీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఆరో స్థానంలో, లక్నో ఏడో స్థానంలో నిలిచాయి. అందుకే ఢిల్లీకి ఇది డూ ఆర్ డై పోటీ.

లక్నో-ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డ్..

లక్నో, ఢిల్లీ మధ్య ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల గురించి మాట్లాడితే, లక్నో 3 మ్యాచ్‌లను గెలుచుకుంది. అంటే లక్నోదే పైచేయి. గత మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఓడిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక రోజు ముందుగానే RCB చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో, లక్నో గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్ గైర్హాజరీ ప్రభావం..

స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రిషబ్ పంత్ ఆడలేదు. దీని ప్రభావం ఢిల్లీ జట్టుపై పడింది. ఇప్పుడు అతను లక్నోపై పునరాగమనం చేయగలడు. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్‌కు బలం చేకూరనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది.

కేఎల్ రాహుల్‌పైనే ఆశలన్నీ..

గత మ్యాచ్‌లో హైదరాబాద్‌తో ఓటమి తర్వాత, జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌తో కోపంగా మాట్లాడుతున్న వీడియో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి రాహుల్ లక్నో జట్టు భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదా మిగిలిన రెండు మ్యాచ్‌ల తర్వాత జట్టుతో బంధాన్ని తెంచుకోవచ్చు. అయితే దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

లక్నో బౌలింగ్ బలహీనత..

గాయం కారణంగా మయాంక్ యాదవ్ ఐపీఎల్‌కు దూరం కావడం లక్నో సూపర్ జెయింట్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. యశ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. గాయం కారణంగా మొహ్సిన్ ఖాన్ కూడా చివరి మ్యాచ్ ఆడలేదు. కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ కూడా ఫామ్‌లో లేరు.

ఢిల్లీ బలహీన ఫీల్డింగ్..

RCBతో జరిగిన చివరి మ్యాచ్‌లో, ఢిల్లీ ఆటగాళ్లు చాలా క్యాచ్‌లను వదులుకున్నారు. దీంతో జట్టుకు ఖరీదైనదిగా నిరూపింతమైంది. లక్నోపై గెలవాలంటే ఢిల్లీ ఈ తప్పును సరిదిద్దుకోవాలి.

రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, జాక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్), అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, రసిక్ సలామ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కే గౌతం, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు TGPSC కీలక అప్‌డేట్
తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు TGPSC కీలక అప్‌డేట్
నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..
నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..
రూ.12 లక్షలు పెట్టి కుక్కల మారిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా.?
రూ.12 లక్షలు పెట్టి కుక్కల మారిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా.?
భారతీయుడు 2 నుంచి శౌర సాంగ్ విడుదల.. కానీ కమల్ మిస్సింగ్.
భారతీయుడు 2 నుంచి శౌర సాంగ్ విడుదల.. కానీ కమల్ మిస్సింగ్.
పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
వరమాల వేళ రెచ్చిపోయిన వరుడు.. పాపం.. వధువు పరిస్థితి చూడాలి మరీ.!
వరమాల వేళ రెచ్చిపోయిన వరుడు.. పాపం.. వధువు పరిస్థితి చూడాలి మరీ.!
చూరకత్తుల చూపుల చిన్నది ఎవరో గుర్తుపట్టగలరా.. ?
చూరకత్తుల చూపుల చిన్నది ఎవరో గుర్తుపట్టగలరా.. ?
వస్తావా.. లేదా..? మనవడికి తాత మాస్‌ వార్నింగ్‌..!
వస్తావా.. లేదా..? మనవడికి తాత మాస్‌ వార్నింగ్‌..!
అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..
అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..
బురదలో కూర్చొని నిరసన తెలిపిన మహిళ.. అసలేం జరిగిందంటే..
బురదలో కూర్చొని నిరసన తెలిపిన మహిళ.. అసలేం జరిగిందంటే..