Dawid Malan: టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌ను దక్కించుకున్న పంజాబ్ కింగ్స్.. ఎంత ధరకు పలికాడో తెలుసా.!
Dawid Malan IPL Auction 2021: అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్....
Dawid Malan IPL Auction 2021: అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్. గత కొంతకాలంగా టీ20 ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాత్రం ఆడలేదు. ఈ సీజన్ మినీ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఫ్రాంచైజీలు కూడా అతని కోసం పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా తక్కువ ప్రైస్‌కే పంజాబ్ కింగ్స్ ఈ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌ను దక్కించుకుంది. పెద్దగా పోటీ లేకుండానే పంజాబ్ టీమ్ సొంతం చేసుకుంది.
ఇప్పటిదాకా అమ్ముడైన ప్లేయర్స్:
స్టీవ్ స్మిత్‌ను రూ. 2.20 కోట్లకు ఢిల్లీ, షకిబుల్ హాసన్‌ను రూ. 3.20 కోట్లకు కోల్‌కతా, మొయిన్ అలీని రూ. 7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్, శివమ్ దూబేను రూ. 4.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, మోరిస్ రూ. 16.25 కోట్లకు రాజస్థాన్, మలన్ రూ. 1.50 కోట్లకు పంజాబ్, మిలన్ రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్
అమ్ముడుపోని ప్లేయర్స్:
ఆరోన్ ఫించ్, కేదార్ జాదవ్, లెవీస్, జాసన్ రాయ్, హనుమ విహారి, హాల్స్, కరుణ్ నాయర్, ఫిలిప్స్, క్యారీ, పెరెరా, ముస్తాఫిజుర్ రెహమాన్ ఉన్నారు.