Daryl Mitchell IPL Auction 2024: రికార్డు ధరతో ధోని జట్టులోకి ‘డ్యాషింగ్’ డారిల్‌ మిచెల్‌.. ఎన్ని కోట్లంటే?

Daryl Mitchell Auction Price : న్యూజిలాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ జాక్‌ పాట్‌ కొట్టాడు. ప్రపంచకప్‌లో భారత్‌పై రెండు సెంచరీలు బాదిన ఈ డ్యాషింగ్‌ ప్లేయర్‌ ఐపీఎల్‌లో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కోటి రూపాయల బేస్‌ ప్రైజ్‌తో ఐపీఎల్‌ వేలంలోకి వచ్చిన ఈ ప్రపంచ కప్ హీరోను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి

Daryl Mitchell IPL Auction 2024: రికార్డు ధరతో ధోని జట్టులోకి డ్యాషింగ్ డారిల్‌ మిచెల్‌.. ఎన్ని కోట్లంటే?

Updated on: Dec 19, 2023 | 4:15 PM

Daryl Mitchell IPL 2024 Auction Price: న్యూజిలాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ జాక్‌ పాట్‌ కొట్టాడు. ప్రపంచకప్‌లో భారత్‌పై రెండు సెంచరీలు బాదిన ఈ డ్యాషింగ్‌ ప్లేయర్‌ ఐపీఎల్‌లో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కోటి రూపాయల బేస్‌ ప్రైజ్‌తో ఐపీఎల్‌ వేలంలోకి వచ్చిన ఈ ప్రపంచ కప్ హీరోను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. అయితే మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏకంగా రూ. 14 కోట్లు వెచ్చించి డారిల్‌ మిచెల్‌ ను సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్ 2022 వేలంలో రూ.75ల‌క్ష‌ల‌కు డారిల్ మిచెల్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ద‌క్కించుకుంది. అయితే కేవలం రెండు మ్యాచులు మాత్ర‌మే ఆడాడు. గ‌తేడాది వేలానికి ఆర్ఆర్ అత‌డిని విడిచిపెట్టింది. దీంతో కోటీ రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో అత‌డు వేలంలోకి వ‌చ్చాడు. అయితే.. ఎవ్వ‌రూ డారిల్‌ పై ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో అమ్ముడు పోలేదు. అయితే భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌ లో పరుగుల వర్షం కురిపించాడీ హార్డ్‌ హిట్టర్‌. ముఖ్యంగా టీమిండియాపైనే రెండు భారీ సెంచరీలు బాదాడు. దీంతో ఈ సారి రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడు పోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన రెండో ఆట‌గాడు మిచెల్‌ కావడం విశేషం.

న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు డారిల్ మిచెల్. ఇప్పటివరకు అతను 20 టెస్టులు, 39 వ‌న్డేలు, 56 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 1,452 ప‌రుగులు, వ‌న్డేల్లో 1,577 ప‌రుగులు, టీ20ల్లో 1,069 ప‌రుగులు చేశాడు. టీ20ల్లో కూడా ఐదు అర్ధ‌శ‌త‌కాలు బాదాడు. హార్డ్ హిట్టర్ గా పేరొందిన డారిల్ మిచెల్ ఫాస్ట్ బౌలర్ గా సత్తా చాటాడు. 2024 ఐపీఎల్ సీజన్ కు గానూ చెన్నై సూపర్ కింగ్స్ ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను విడుదల చేసింది. ఇప్పుడు అతని స్థానంలో డారిల్ లాంటి డ్యాషింగ్ ఆల్ రౌండర్ ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ స్థానంలో ..

అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్..