AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36 ఫోర్లు, 1 సిక్స్.. తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన మరో బుడ్డోడు

Danish Malewar's Double Century: సెంట్రల్ జోన్‌కు చెందిన డానిష్ మాలేవర్ దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ (203 పరుగులు)తో విదర్భ క్రికెట్‌కు కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దులీప్ ట్రోఫీలో విదర్భ ఆటగాడు నమోదు చేసిన తొలి డబుల్ సెంచరీ ఇది. రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన డానిష్ తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోనే ఈ ఘనతను సాధించాడు.

36 ఫోర్లు, 1 సిక్స్.. తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన మరో బుడ్డోడు
Danish Malewar Double Century
Venkata Chari
|

Updated on: Aug 30, 2025 | 8:18 AM

Share

Danish Malewar’s Double Century: దులీప్ ట్రోఫీలో ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్ రౌండ్ జరుగుతోంది. ఈ రౌండ్‌లో సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ ను 532 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టు తరపున డబుల్ సెంచరీ ఆడిన డానిష్ మాలేవర్ 203 పరుగులు చేశాడు. డానిష్ ఇన్నింగ్స్ లో 36 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. డానిష్ మాత్రమే కాదు, కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా సెంచరీ సాధించాడు. ఈ డబుల్ సెంచరీతో డానిష్ మాలేవర్ విదర్భ నుంచి మరే ఇతర ఆటగాడు సాధించని ఘనతను సాధించాడు.

డానిష్ మాల్వేర్ రికార్డ్..

దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన వెంటనే డానిష్ మాలెవర్ పేరు విదర్భ క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నిజానికి, దులీప్ ట్రోఫీలో తన అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన తొలి విదర్భ ఆటగాడు డానిష్. ఇప్పటివరకు, దులీప్ ట్రోఫీలో నలుగురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే డబుల్ సెంచరీ సాధించారు. వీరిలో యశస్వి జైస్వాల్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ ఉన్నారు. ఇప్పుడు డానిష్ పేరు కూడా అందులో చేరాడు.

డానిష్ కెరీర్..

డానిష్ మాలేవర్ వయసు కేవలం 21 సంవత్సరాలు. రంజీ ట్రోఫీ చివరి సీజన్‌లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. మొదటి రంజీ ఎడిషన్‌లో, డానిష్ 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సహాయంతో 783 పరుగులు చేశాడు. ఇప్పుడు, అతని బ్యాట్ నుంచి డబుల్ సెంచరీ కూడా వచ్చింది. ఇది అతని ప్రొఫెషనల్ కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీ. డానిష్ గతంలో రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ చేశాడు. డానిష్ విదర్భ ప్రో లీగ్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. అతను 6 మ్యాచ్‌ల్లో 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 318 పరుగులు చేశాడు. దీని ద్వారా, అతను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..