Video: దటీజ్ ధోనీ స్పెషల్.. మెరుపు వేగంతో స్టంపింగ్.. షాక్‌లో డేంజరస్ ప్లేయర్.. వైరల్ వీడియో..
GT vs CSK, IPL 2023 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు రిజర్వ్ డే రోజున చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

GT vs CSK, IPL 2023 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు రిజర్వ్ డే రోజున చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటాన్స్ టీం 10ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా ఉన్నారు.




20 బంతుల్లో 39 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధోనీ వికెట్ల వెనకాల కళ్లు చెదిరే స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. దీంతో డేంజర్ ప్లేయర్ గిల్ షాకవుతూ పెవిలియన్ వైపు అడుగులు వేశాడు.
పవర్ ప్లేలో చెన్నైకు పంచ్..
పవర్‌ప్లేలో వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్‌ల క్యాచ్‌లను చాహర్ వదిలేశాడు . రెండో ఓవర్ నాలుగో బంతికి తుషార్ దేశ్‌పాండే లెగ్ స్టంప్‌పై మంచి లెంగ్త్ విసిరాడు. గిల్ దానిని స్క్వేర్ లెగ్ వైపు ఆడాడు. అక్కడే ఉన్న చాహర్ బంతిని మిస్ చేసి క్యాచ్ పూర్తి చేయలేకపోయాడు. ఈ విధంగా 3 పరుగుల స్కోరులో గిల్‌కు లైఫ్ లభించింది.
ఐదో ఓవర్‌లో చాహర్ తన బౌలింగ్‌లో సాహా క్యాచ్‌ను జారవిడిచాడు. తొలి బంతిని షార్ట్ పిచ్‌ని నెమ్మదిగా బౌలింగ్ చేశాడు. సాహా ముందు వైపు షాట్ ఆడాడు. బంతి చాహర్ వైపు వచ్చింది. కానీ అతను ఫాలో త్రూ క్యాచ్ చేయలేడు.
Lightning fast MSD! ⚡️ ⚡️
How about that for a glovework ? ?
Big breakthrough for @ChennaiIPL as @imjadeja strikes! ? ?#GT lose Shubman Gill.
Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/iaaPHQFNsy
— IndianPremierLeague (@IPL) May 29, 2023
250వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ..
ఐపీఎల్‌లో ధోనీకి ఇది 250వ మ్యాచ్. దీంతో తొలి ఆటగాడిగా నిలిచాడు. ధోని తర్వాత రోహిత్ శర్మ 243, దినేష్ కార్తీక్ 242 మ్యాచ్‌లు ఆడారు.
జట్లు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.