
Chennai Super Kings: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే ఆరో టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. గత సీజన్‌లో ఓపెనింగ్ సమస్యలతో ఇబ్బంది పడ్డ చెన్నై జట్టుకు, సంజు శాంసన్ చేరిక పెద్ద ఊరటనిస్తోంది. పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లపై సంజు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం సంజు మంచి ఫామ్‌లో ఉండటం చెన్నై జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్.
గతంలో చెన్నైలోని పిచ్ స్లోగా ఉండేదని, కానీ ఇప్పుడు అది పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందని చావ్లా వెల్లడించారు. అగ్రెసివ్ బ్యాటింగ్‌కు ఈ పిచ్ సహకరిస్తుందని, ఓపెనింగ్‌లో సంజు శాంసన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోర్లు అందించగలడని ఆయన అభిప్రాయపడ్డారు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయే సమస్యను సంజు రాకతో సీఎస్‌కే అధిగమించనుంది. ఆయుష్ బదోని వంటి కుర్రాళ్ళు కూడా జట్టులో ఉండటం బ్యాటింగ్‌ను మరింత పటిష్టం చేసింది.
ఇక మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. సంజు రాకతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. ఎంఎస్ ధోనీ తర్వాత జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా సంజు కీలక పాత్ర పోషిస్తాడని పఠాన్ పేర్కొన్నారు. ఎంఎస్ ధోనీ మద్దతు, సంజు సహకారం రుతురాజ్ కెప్టెన్సీకి ఎంతో ఉపయోగపడతాయని ఆయన విశ్లేషించారు.
డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే వంటి పవర్ హిట్టర్లతో సీఎస్‌కే స్క్వాడ్ ఇప్పుడు ఎంతో బలంగా కనిపిస్తోంది. మినీ వేలంలో అద్భుతమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం ద్వారా, గత సీజన్ వైఫల్యాలను మర్చిపోయి ఆత్మవిశ్వాసంతో ఆరో టైటిల్ కోసం బరిలోకి దిగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..