ఫీల్డ్ నుంచి భువనేశ్వర్ ఔట్!
మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మైదానం నుంచి వెళ్ళిపోయాడు. భువనేశ్వర్ మూడో ఓవర్ వేస్తున్న సమయంలో కండరాలు పట్టేయడంతో గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. దానితో భువనేశ్వర్ వేయాల్సిన మిగితా బంతులను విజయ్ శంకర్ వేసి ఆ ఓవర్ పూర్తి చేశాడు. అయితే కెప్టెన్ కోహ్లీతో పాటు అందరిని ఆశ్చర్యపరుస్తూ.. విజయ్ శంకర్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. కాగా వరల్డ్‌కప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన 3వ బౌలర్‌గా రికార్డు […]
మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మైదానం నుంచి వెళ్ళిపోయాడు. భువనేశ్వర్ మూడో ఓవర్ వేస్తున్న సమయంలో కండరాలు పట్టేయడంతో గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. దానితో భువనేశ్వర్ వేయాల్సిన మిగితా బంతులను విజయ్ శంకర్ వేసి ఆ ఓవర్ పూర్తి చేశాడు. అయితే కెప్టెన్ కోహ్లీతో పాటు అందరిని ఆశ్చర్యపరుస్తూ.. విజయ్ శంకర్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. కాగా వరల్డ్‌కప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన 3వ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.