
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తన ప్రతాపాన్ని చూపించాడు. అతను కొట్టిన షాట్లకు అభిమానులే కాక అంతర్జాతీయ క్రికెట్ మాజీలు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఈ యువ ఆటగాడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేనా అంతర్జాతీయ క్రికెట్‌లో అతనే ప్రస్తుత అత్యుత్తమ టీ20 బ్యాటర్ కూడా. అంతేకాక న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా సూర్య తనదైన రీతిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. అతని ఆట తీరుపై సర్వత్రా ప్రశంసలే వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆటగాడు భారత జట్టులోకి మూడు, నాలుగేళ్ల క్రితమే వచ్చి ఉంటే బాగుండేదనుకునేవారూ లేకపోలేదు. ఆలస్యంగానే ఆరంగేట్రం చేసిన అతను వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ వెలుగులోకి వస్తున్నాడు.
అయితే డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్, రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఇప్పటికే వన్డే ఫార్మాట్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కు ఆ పర్యటనలో స్థానం ఇవ్వలేదు బీసీసీఐ. దీంతో క్రికెట్ అభిమానులంతా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ విషయంలోనూ బీసీసీఐ ఇలాగే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. బీసీసీఐ ఒక కులానికే అనుకూలంగా ఉంటూ.. మిగిలినవారికి అన్యాయం చేస్తోందని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. అంతేకాక ట్విట్టర్లో #Castiest_BCCI అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు కూడా చేస్తున్నారు.
BCCITweet and Retweet against the exclusion of the in-form #SuryakumarYadav and the talented #SanjuSamson from the Indian team. #Casteist_BCCI pic.twitter.com/sCLYiMOCJl
— @Bhaluram parmar (@iEVFd6RcQ5WZIRW) November 24, 2022
టీ20లను అత్యద్భుతంగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలు ఆడలేడా…? వన్డేలు ఆడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని సూర్య, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లకు బీసీసీఐ అన్యాయం చేస్తోందని వారు మండిపడుతున్నారు. కొంత మంది అయితే క్రికెట్‌లోనూ తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు.
Top batsman in T-20 @surya_14kumar is not ODI worthy ? @BCCI #SuryakumarYadav #Casteist_BCCI @Profdilipmandal pic.twitter.com/eZsgXXg8Q3
— Akshat kulshreshtha (@akshatkul_) November 24, 2022