టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో నెం.1 బౌలర్‌గా మారడం తర్వాత మహమ్మద్ సిరాజ్ కృతజ్ఞతలు తెలిపిన పాత వీడియో మళ్లీ సోషల్ మీడియాను చుట్టేస్తేంది. 28 ఏళ్ల పేసర్ గత ఒక సంవత్సరంలో భారతదేశం కోసం రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నాడు. ODIలలో దేశానికి ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో సత్తా చాటిన ఈ హైదరాబాద్ పేసర్.. ట్రెంట్ బౌల్ట్, హేజిల్‌వుడ్ లాంటి స్థార్ బౌలర్లను వెనక్కినెట్టి నెంబర్ వన్‌గా నిలిచాడు. 729 రేటింగ్ పాయింట్లతో సిరాజ్ తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ 727 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 708 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
సిరాజ్ 2023లో శ్రీలంకతో జరిగిన మూడు ODIలలో తొమ్మిది వికెట్లు.. న్యూజిలాండ్‌పై స్వదేశంలో రెండు వికెట్లతో ఆ ఫామ్‌ను కొనసాగించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో కోహ్లీకి మద్దతు ఇచ్చినందుకు సిరాజ్ ఘనత సాధించాడు. తనకు సపోర్ట్‌గా నిలిచిన జట్టు మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
The only one who believed in Siraj and his skills was Virat ??@imVkohli @mdsirajofficial#MohammedSiraj
#ICCRankings pic.twitter.com/ZEwbM7X6UX— Leela Parshad ? (@runner_lp10) January 25, 2023
సిరాజ్ 2019లో అరంగేట్రం చేసిన తర్వాత ఇప్పటివరకు 21 వన్డేలు ఆడాడు మరియు జస్ప్రీత్ బుమ్రా మరియు కపిల్ దేవ్ తర్వాత వన్డే బౌలర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్న మూడో భారత పేసర్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం