Cricket Controversy : ఐసీసీ రూల్స్ బుక్కును తగలేశారా?..పాక్ గెలుపు వెనుక అంపైర్ల కుట్ర..బాబర్ క్యాచ్‌పై అభిమానుల ఆగ్రహం
Cricket Controversy : టీ20 వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా మొదలైందో లేదో.. అప్పుడే అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌కు అంపైర్లు కొమ్ముకాచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెదర్లాండ్స్ బ్యాటర్ అవుట్ విషయంలో ఐసీసీ కొత్త రూల్స్‌ను అంపైర్లు తుంగలో తొక్కారా? లేక భారత్‌కు ఒక రూల్, పాకిస్థాన్‌కు మరో రూల్ అమలు చేస్తున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

Cricket Controversy : టీ20 వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా మొదలైందో లేదో.. అప్పుడే అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌కు అంపైర్లు కొమ్ముకాచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెదర్లాండ్స్ బ్యాటర్ అవుట్ విషయంలో ఐసీసీ కొత్త రూల్స్‌ను అంపైర్లు తుంగలో తొక్కారా? లేక భారత్‌కు ఒక రూల్, పాకిస్థాన్‌కు మరో రూల్ అమలు చేస్తున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇంతకీ అసలు వివాదం ఏంటి? ఆ రిలే క్యాచ్ కథాకమీమామిషు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
అసలేం జరిగింది? ఆ వివాదాస్పద క్యాచ్ ఏంటి?
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మైఖేల్ లెవిట్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద బాబర్ ఆజమ్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ తప్పడంతో బంతిని గాలిలోకి విసిరి బౌండరీ లైన్ అవతలకు వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న షాహీన్ ఆఫ్రిది ఆ బంతిని అందుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఐసీసీ కొత్త రూల్ ప్రకారం.. ఒక ప్లేయర్ బంతిని విసిరిన తర్వాత, రెండో ప్లేయర్ క్యాచ్ పూర్తి చేసే సమయానికి మొదటి ప్లేయర్ కచ్చితంగా గ్రౌండ్ లోపలికి (ఫీల్డ్ ఆఫ్ ప్లే) తిరిగి రావాలి. కానీ బాబర్ ఇంకా బౌండరీ బయటే ఉన్న సమయంలోనే షాహీన్ క్యాచ్ పూర్తి చేశాడు. అంపైర్లు దీనిని అవుట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది.
A solid relay catch!
Babar Azam & Shaheen Afridi produce a great relay catch at the boundary!
ICC Men's #T20WorldCup | #PAKvNED | LIVE NOW 👉 https://t.co/GKcXaJHm9F pic.twitter.com/Anou9KM88n
— Star Sports (@StarSportsIndia) February 7, 2026
భారత ఆటగాడి విషయంలో జరిగిన పాత ఉదంతం
గతంలో రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో భారత్-ఏ వర్సెస్ పాకిస్థాన్-ఏ మ్యాచ్ సందర్భంగా ఇవే పరిస్థితులు ఎదురయ్యాయి. భారత ఆటగాడు నెహాల్ వధేరా సరిగ్గా ఇలాగే రిలే క్యాచ్ పట్టాడు. అప్పుడు థర్డ్ అంపైర్ నిశితంగా పరిశీలించి.. వధేరా బంతిని విసిరాక, రెండో ప్లేయర్ క్యాచ్ పట్టే సమయానికి వధేరా ఇంకా గ్రౌండ్ లోపలికి రాలేదని తేల్చారు. ఐసీసీ రూల్ 19.5.2 ప్రకారం దానిని నాటౌట్‌గా ప్రకటించి బౌండరీ ఇచ్చారు. ఇప్పుడు బాబర్ ఆజం విషయంలో కూడా అదే తప్పు జరిగినా అంపైర్లు అవుట్ ఇవ్వడం పక్షపాతమే అని భారత అభిమానులు మండిపడుతున్నారు.
It was all happening in Qatar 👀 And things got pretty heated in the middle…
Watch India A take on Pakistan A in #AsiaCupRisingStars2025 – LIVE NOW on #SonyLIV and #SonySportsNetwork TV channels 📺 pic.twitter.com/OZ56KQYxf0
— Sony LIV (@SonyLIV) November 16, 2025
Babar Azam and Shaheen Afridi combine for this fantastic catch on the boundary😀#T20WorldCup #PAKvNED #NEDvPAK pic.twitter.com/0JIpTUvqDH
— Cricbuzz (@cricbuzz) February 7, 2026
ఐసీసీ వివరణ కోరుతున్న ఫ్యాన్స్
ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. భారత్‌కు ఒక రూల్, పాకిస్థాన్‌కు మరో రూలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ తన నిబంధనలను పారదర్శకంగా అమలు చేయడం లేదని, అంపైర్ల పొరపాటు వల్ల నెదర్లాండ్స్ జట్టు కీలక వికెట్ కోల్పోయిందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ వైపు మొగ్గడానికి ఈ నిర్ణయం కూడా ఒక కారణమని డచ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఈ ఘటనపై ఐసీసీ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
