AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaheen Afridi : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాహీన్ అఫ్రిది పతనం..డచ్ టీమ్ దెబ్బకు ప్రమాదంలో పడిన కెరీర్ ?

Shaheen Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి కోలుకోలేని దెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్‌లోనే నెదర్లాండ్స్ లాంటి చిన్న టీమ్ బ్యాటర్లు అతడిని ఓ ఆట ఆడుకున్నారు. 2009 తర్వాత మళ్లీ కప్పు కొట్టాలని ఆశగా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు, షాహీన్ ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

Shaheen Afridi : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాహీన్ అఫ్రిది పతనం..డచ్ టీమ్ దెబ్బకు ప్రమాదంలో పడిన కెరీర్ ?
Michael Leavitt
Rakesh
|

Updated on: Feb 07, 2026 | 4:24 PM

Share

Shaheen Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి కోలుకోలేని దెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్‌లోనే నెదర్లాండ్స్ లాంటి చిన్న టీమ్ బ్యాటర్లు అతడిని ఓ ఆట ఆడుకున్నారు. 2009 తర్వాత మళ్లీ కప్పు కొట్టాలని ఆశగా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు, షాహీన్ ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. పసికూన నెదర్లాండ్స్ ఓపెనర్ మైఖేల్ లెవిట్ బాదిన బాదుడుకి బంతి ఆకారం మారిపోవడమే కాకుండా, స్టేడియం బయట పడటంతో అంపైర్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది.

తొలి బంతి నుంచే ఊచకోత

కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లారు నెదర్లాండ్స్ బ్యాటర్లు. మ్యాచ్ ఆరంభంలోనే షాహీన్ అఫ్రిది తన పదునైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తాడని బాబర్ సేన ఆశించింది. కానీ సీన్ మొత్తం ఉల్టా అయింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే మైఖేల్ లెవిట్ ఫోర్ కొట్టి షాహీన్‌కు వెల్‌కమ్ చెప్పాడు. తొలి ఓవర్లోనే 9 పరుగులు సమర్పించుకున్న షాహీన్, మూడో ఓవర్లో మరింత దారుణంగా దెబ్బతిన్నాడు. లెవిట్ ఒక భారీ సిక్సర్ బాదడంతో బంతి స్టేడియం వెలుపల పడింది. ఆ దెబ్బకు బంతి ఆకారం కూడా దెబ్బతినడంతో అంపైర్లు దానిని మార్చాల్సి వచ్చింది.

నిరాశపరిచిన గణాంకాలు

షాహీన్ అఫ్రిది ఈ మ్యాచ్‌లో కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు లీక్ చేశాడు. పసికూన బ్యాటర్ల ధాటికి తట్టుకోలేక పాక్ కెప్టెన్ అతడికి కనీసం 4 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయనివ్వలేదు. కేవలం 3 ఓవర్లు మాత్రమే వేయించి సరిపెట్టాడు. చివరగా 19వ ఓవర్లో టెయిల్ ఎండర్లతో బౌలింగ్ చేసినప్పుడు ఒక వికెట్ దక్కినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 3 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీసిన షాహీన్ ప్రదర్శన పాక్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

పాక్ గెలిచినా ఆందోళన తప్పదు

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ, వారి ప్రధాన బౌలర్ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు షాహీన్ ఇలా దెబ్బతినడం పాకిస్థాన్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి అగ్రెసివ్ బ్యాటర్లను షాహీన్ ఎలా అడ్డుకుంటాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మైఖేల్ లెవిట్ లాంటి బ్యాటరే అంతలా బాదితే, టీమిండియా బ్యాటర్లు ఇంకెంత ఊచకోత కోస్తారోనని పాక్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..