IPL 2025: హైదరాబాద్‌ను సన్‌రైజర్స్ వీడనుందా.? SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

|

Apr 01, 2025 | 7:59 AM

సన్‌రైజర్స్ హైదరాబాద్...హోమ్ గ్రౌండ్‌ హైదరాబాద్‌లో ఉండదా..? HCA...SRHను టార్చర్ పెడుతోందా..? అందుకే హైదరాబాద్‌ నుంచి మరో వేదికను కోరుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది క్రికెట్ సర్కిల్స్‌లో. దీనిపై తెలంగాణ సీఎం కూడా విజిలెన్స్‌ దర్యాప్తుకు ఆదేశించారంటే..ఇష్యూ చాలా సీరియస్‌గా ఉందని అర్థమవుతోంది., ఇంతకూ HCA ..SRHను ఎందుకు వేధిస్తోంది...? వివాదం లేనిదే HCAకు పూటగడవదా..?

IPL 2025: హైదరాబాద్‌ను సన్‌రైజర్స్ వీడనుందా.? SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
Srh Vs Hca
Follow us on

HCA వర్సెస్ SRH. ఇది క్రికెట్ అభిమానులకు కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ.. రియాల్టీలో మాత్రం ఇదే జరుగోతంది. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫ్రీపాస్ విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు వివాదమేంటో చూస్తే.. HCA అధికారులు ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు, ఒత్తిడి చేస్తున్నారని, గత రెండేళ్లుగా ఈ సమస్యలు కొనసాగుతున్నాయని SRH ఆరోపిస్తోంది. మార్చిన 27న కూడా HCA-SRH మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా HCA ఫ్రీపాస్‌ల విషయంలో గొడవ చేసిందని.. మ్యాచ్‌కు ముందు ఒక కార్పొరేట్ బాక్స్‌ను HCA తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని SRH ఆరోపిస్తోంది. ఇలాంటి గొడవలు కంటిన్యూ అయితే.. తమ హోమ్‌గ్రౌండ్‌ను వేరే వేదికకు తరలిస్తామని SRH వార్నింగ్ ఇస్తోంది. ఈమేరకు HCAకు మెయిల్‌ కూడా పంపినట్లు సమాచారం. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, బీసీసీఐకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆ మెయిల్‌లో SRH హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి.

కానీ HCA వెర్షన్ మరోలా ఉంది. అసలు ఫ్రీపాస్‌ల విషయంలో తామెవరినీ బెదిరించలేదని.. SRH నుంచి ఎలాంటి అధికారిక ఈ-మెయిల్ రాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. అసలు ఈ-మెయిల్ నిజంగా లీక్ అయిందా? లేక SRH దీన్ని బహిర్గతం చేసి HCAపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అన్నది HCA వాదన. మామూలుగా HCAతో ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10%.. అంటే సుమారు 3,900 టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో F12A కార్పొరేట్ బాక్స్‌లో 50 సీట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్‌లో HCA ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లేనని, అదనంగా 20 సీట్లు మరో బాక్స్‌లో ఇవ్వాలని కోరింది. SRH ఈ అదనపు డిమాండ్‌ను నిరాకరించడంతో, HCA మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ రోజున F3 బాక్స్‌ను తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని SRH ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని SRH.. HCA ట్రెజరీకి మెయిల్ చేసిందన్నవార్తలు వచ్చాయి.

నిజంగా SRH ఆరోపణల్లో వాస్తముండి.. HCA టార్చర్‌ పెడుతుంటే.. SRH హోమ్‌గ్రౌండ్‌ను వీడే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌కు పెద్ద దెబ్బ. ఇది కేవలం క్రికెట్ సమస్యగానే కాదు..హైదరాబాద్ ఇమేజ్‌పైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. IPL జట్టును కోల్పోవడం అంటే అటు ప్రభుత్వానికి.. HCA సామర్థ్యానికి పెద్ద తలవొంపే. IT హబ్‌గా పేరున్న హైదరాబాద్‌కు ఇది బిగ్ బ్లండర్‌ మెస్టేక్. SRH ఈ విషయాన్ని BCCI, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది. BCCI జోక్యం చేసుకుంటే, HCAపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే SRHకి తాత్కాలికంగా విశాఖపట్నం వంటి వేరే వేదికను కేటాయించవచ్చు.

అందుకే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి SRHకు మద్దతుగా HCAకు వార్నింగ్ ఇచ్చారు. ఫ్రీ పాసుల విషయంలో సన్‌ రైజర్స్‌ను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. HCAపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో.. HCAఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. HCAపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఫ్రీపాస్ వివాదం. మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటు పోతుందోనన్న ఆందోళన అటు క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది. మరి చూడాలి..ఇష్యూ చినిగి చాటవకుండా..నాలుగు గోడలమధ్యే పరిష్కారమవుతుందా.. అన్నది.