Ganguly vs Kohli: ఆ విషయంలో అబద్ధం చెప్పింది కోహ్లీనే.. గంగూలీ కాదు: చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన ఆరోపణలు..
Chetan Sharma Controversy: 2021 చివరి నెలలో క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు, వెటరన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వివాదం జరిగింది.
Chetan Sharma Controversy: గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో వివాదాలా సద్దుమణిగి, ప్రశాంతంగా ఉంది. ఎటువంటి గొడవలు లేవు. ఇలాంటి సమయంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చేసిన స్టింగ్ ఆపరేషన్ కలకలం సృష్టించింది. ఓ ప్రైవేట్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పలు వాదనలు చేశాడు. ఇందులో సౌరవ్ గంగూలీ vs విరాట్ కోహ్లీకి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఉంది.
2021 చివరి నెలలో క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు, వెటరన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వివాదం జరిగింది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించిన తర్వాత ఈ వివాదం మొదలైంది. ఇందులో గంగూలీ చేసిన ప్రకటనను కోహ్లీ తప్పుగా చెప్పడంతో దానిపై దుమారం చెలరేగింది.
కోహ్లి vs గంగూలీ ఎపిసోడ్..
సెప్టెంబరు 2021లో కోహ్లీ మొదట టీ20 జట్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత డిసెంబర్‌లో కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారు. దీనికి సంబంధించి వివాదం జరిగింది. అప్పటి బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెప్టెంబర్ 2021లో టీ20 కెప్టెన్సీని వదులుకునే ముందు మరోసారి ఆలోచించాలని కోహ్లీని కోరానని తెలిపాడు. ఆ తర్వాత ఆఫ్రికన్ టూర్‌కు ముందు విలేకరుల సమావేశంలో కోహ్లి నాతో ఎవరూ ఏం చెప్పలేదంటూ ప్రకటించాడు. దీంతో గంగూలీ వర్సెస్ కోహ్లీ వివాదం చాలా రోజులు నడిచింది.
కోహ్లీకి సలహా ఇచ్చిన గంగూలీ..
ఆ సమయంలో కూడా చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నాడు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించిన గంగూలీ.. రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించాడు. ఈ విషయంలో కోహ్లీ అబద్ధం చెప్పాడని శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో ఆరోపించారు. చీఫ్ సెలక్టర్ ప్రకారం, బీసీసీఐ అధ్యక్షుడి కారణంగా తన కెప్టెన్సీని లాగేసుకున్నారని విరాట్ కోహ్లీ భావించాడు. సెలక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్సింగ్‌లో 9 మంది ఉన్నారు. ఆ సమయంలో గంగూలీ మాట్లాడుతూ, మరోసారి ఆలోచించండి అంటూ కోహ్లీకి సూచించాడు. ఇది కోహ్లీ వినలేదని నేను అనుకుంటున్నాను. అప్పుడు నాతో పాటు మరో 9 మంది ఉన్నారు. మిగిలిన వారు సెలెక్టర్లు, బీసీసీఐ అధికారులు ఉన్నారని స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పుకొచ్చాడు.
‘కోహ్లీ అబద్ధం చెప్పాడు’
కోహ్లి అబద్ధం చెబుతున్నాడని, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియా సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని లేవనెత్తాడని చేతన్ శర్మ ఆరోపించాడు. దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లే ముందు విలేకరుల సమావేశం జట్టు గురించి అయితే.. కెప్టెన్సీ అంశాన్ని ఎందుకు లేవనెత్తారని ఆరోపించాడు. కోహ్లి అబద్ధం చెబుతున్నాడనేది నిజమని, మరోసారి ఆలోచించుకోవాలని గంగూలీ కోరాడని తెలిపాడు. కోహ్లీ ఎందుకు అబద్ధం చెప్పాడో ఎవరికీ తెలియదు. ఇది బోర్డు వర్సెస్ ప్లేయర్ వివాదంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..