- Telugu News Photo Gallery Cricket photos Hardik Pandya and Natasa Stankovic Get Married Again in Udaipur, Photos goes viral
ముద్దుల తనయుడి సమక్షంలో మళ్లీ పెళ్లిపీటలెక్కిన హార్దిక్- నటాషా.. సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు.. ఫొటోలు చూశారా?
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హార్దిక్ తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో ఫిబ్రవరి 14, మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో రెండోసారి వివాహం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లతో సహా పలు టీమిండియా క్రికెటర్లు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
Updated on: Feb 15, 2023 | 7:21 AM

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హార్దిక్ తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో ఫిబ్రవరి 14, మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో రెండోసారి వివాహం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లతో సహా పలు టీమిండియా క్రికెటర్లు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

భారత T20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్, నటాషా మే 2020లో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. అయితే తమ పెళ్లిని మధుర జ్ఞాపకంగా మల్చుకునేందుకు ప్రేమికుల దినోత్సవాన్ని వేదికగా ఎంచుకున్నారు.

మంగళవారం ఉదయ్‌పూర్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య క్రైస్తవ సంప్రదాయాలతో హార్దిక్-నటాషాల వివాహం జరిగింది. వివాహ వేడుక అనంతరం ఇద్దరూ తమ పెళ్లికి సంబంధించిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమయంలో హార్దిక్, నటాషా ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. అలాగే కుమారుడు అగస్త్య కూడా వారితో ఉన్నాడు.

మూడేళ్ల క్రితం తీసుకున్న మా పాత ప్రమాణాలను పునరావృతం చేయడం ద్వారా మేము ఈ ప్రేమ ద్వీపంలో మళ్లీ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నాం. మేము మా ప్రేమ పండుగను మా కుటుంబం, స్నేహితులతో సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

2020 జనవరి 1న దుబాయ్ వేదికగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు హార్దిక్- నటాషా. ఆతర్వాత అదే ఏడాది మే 31న ఒక కోర్టులో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. కాగా పెళ్లి సమయానికే నటాషా గర్భవతి కావడం, దీనికి తోడు కరోనా రక్కసి ప్రభావంతో సాదాసీదాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టారీ లవ్లీ కపుల్.