IPL 2022: ఐపీఎల్ 2022లో బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. 23 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం..
ఐపీఎల్ 2022 (IPL 2022)లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణి కొట్టింది. వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది...
ఐపీఎల్ 2022 (IPL 2022)లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణి కొట్టింది. వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. శివం దూబే(Shiva dube) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. దూబే 46 బంతుల్లో 88(5 ఫోర్లు, 8 సిక్స్‌లు)పరుగులు చేశాడు. రాబిన్ ఉతప్పు కూడా చాలా రోజుల తర్వాత క్లాసిక్ ఇన్సింగ్స్ ఆడాడు. అతను 50 బంతుల్లో 88(4 ఫోర్లు, 9 సిక్స్‌లు) పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 17, మొయిన్ అలీ 3 పరుగులు చేసి రనౌట్ కాగా రవీంద్ర జడేజా డకౌట్ అయ్యాడు. ధోనీ బ్యాటింగ్‌కు దిగిన స్ట్రైక్ రాలేదు. హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా, హాజెల్‌వుడ్ ఒక వికెట్ తీశాడు.
217 పరుగుల విజయలక్ష్యంతో బారిలోకి దిగిన బెంగళూరు ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. తొమ్మిది బంతుల్లో 8 పరుగులు చేసిన డూ ప్లెసిస్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజ్‌లో కుదురుకోకముందే పెవిలియన్ చేరాడు. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే 12 పరుగులు చేసిన అనుజ్ రావత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ దాటిగా ఆడాడు. 11 బంతుల్లో 26(2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూరును సబాజ్ అహ్మద్, సుయష్ ప్రభుదేశాయి ఆదుకున్నారు. 18 బంతుల్లో 34 పరుగులు చేసిన సుయష్ ప్రభుదేశాయి తీక్షణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రన్ పెరిగిపోతుండడంతో 27 బంతుల్లో 41 పరుగులు చేసిన సబాజ్ అహ్మద్ దాటిగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన హసరంగ కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. కాసేపు చెన్నై బౌలర్లను ప్రతిఘటించిన దినేష్ కార్తిక్ 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.చెన్నై బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు, జడేజా మూడు, మహేష్ చౌదరి, బ్రవో ఒక్కో వికెట్ పడగొట్టారు.