IPL 2022: భారీ స్కోర్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దూబే, ఉతప్ప..

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్(CSK) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు సాధించింది.

IPL 2022: భారీ స్కోర్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దూబే, ఉతప్ప..
Csk
Follow us
Basha Shek

|

Updated on: Apr 12, 2022 | 11:07 PM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్(CSK) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. శివం దూబే(Shiva dube) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. దూబే 46 బంతుల్లో 88(5 ఫోర్లు, 8 సిక్స్‌లు)పరుగులు చేశాడు. రాబిన్‌ ఉతప్పు కూడా చాలా రోజుల తర్వాత క్లాసిక్‌ ఇన్సింగ్స్ ఆడాడు. అతను 50 బంతుల్లో 88(4 ఫోర్లు, 9 సిక్స్‌లు) పరుగులు చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్ 17, మొయిన్ అలీ 3 పరుగులు చేసి రనౌట్ కాగా రవీంద్ర జడేజా డకౌట్‌ అయ్యాడు. ధోనీ బ్యాటింగ్‌కు దిగిన స్ట్రైక్‌ రాలేదు. హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా, హాజెల్‌వుడ్‌ ఒక వికెట్ తీశాడు.

Read Also..Srilanka Economic Crisis: దేశానికి మద్దతుగా నిలవండి.. మీ ఆటను వదిలి రండి.. లంక మాజీ క్రికెటర్‌ రణతుంగ పిలుపు..

CM KCR on Paddy: యాసంగి మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం.. డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమః సీఎం కేసీఆర్