AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయంపై స్పందించిన జడేజా.. తమ ఓటమికి కారణాలు ఇవేనంటూ..

IPL 2022: ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా గురువారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చతికిలపడిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 210 పరుగుల భారీ స్కోర్‌ చేసినా ఫలితం దక్కలేదు...

IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయంపై స్పందించిన జడేజా.. తమ ఓటమికి కారణాలు ఇవేనంటూ..
Ravindra Jadeja
Narender Vaitla
|

Updated on: Apr 01, 2022 | 11:29 AM

Share

IPL 2022: ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా గురువారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో (LSG) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) చతికిలపడిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 210 పరుగుల భారీ స్కోర్‌ చేసినా ఫలితం దక్కలేదు. మూడు బంతులు మిగిలి ఉండగానే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్. ఈ ఇద్దరూ కలిసి 99 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు. లేవిస్ 23 బంతుల్లో 55 పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే అంత భారీ స్కోర్‌ సాధించినప్పటికీ చెన్నై ఓటమి చవి చూడడానికి ఆ జట్టు ఫీల్డింగ్‌లో వైఫల్యం చెందడమే కారణంగా కనిపించింది. ముఖ్యంగా డికాక్‌ క్యాచ్‌ను మొయిన్‌, రాహుల్‌ క్యాచ్‌ను తుషార్‌ పాండే చేజార్చడంతో లక్నోకు రెండు లైఫ్‌లు వచ్చాయి. ఈ రెండు క్యాచ్‌లే చెన్నై ముంచాయి.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రవీంద్ర జడేజా కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన జడేజా.. క్యాచ్‌లు వదిలేయడమే తమ జట్టు ఓటమికి కారణమని తెలిపాడు. ‘మాకు శుభారంభం దక్కినా, రాబిన్‌ ఉత్తప, శివమ్‌ మావి అద్భుతంగా ఆడినా.. ఫీల్డింగ్‌లో విఫలమయ్యాము. ఆ రెండు క్యాచ్‌లను వదిలేయకపోతే బాగుండేది. క్యాచ్‌లు పడితేనే మ్యాచ్‌లు గెలుస్తాం. అంతేకాకుండా మైదానంలో తేమ చాలా ఉంది. దీంతో బాల్‌ను పట్టుకోవడం కూడా కష్టంగా మారింది. ఇక నుంచి తడి బంతితో ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ తమ ఓటమి గురించి చెప్పుకొచ్చాడు జడేజా.

Also Read: Mahindra: నూతన సాంకేతికతలోకి అడుగుపెట్టిన మహీంద్రా గ్రూప్.. ఆనంద్ మహీంద్రా ప్రకటన..

RGV: శ్రీదేవీ బయోపిక్‌ను ఎందుకు తెరకెక్కించలేదు.. అసలు కారణం చెప్పిన రామ్ గోపాల్ వర్మ..

YSR Pension Kanuka: పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. 2.66 లక్షల మంది వాలంటీర్ల ఏర్పాటు