Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: శ్రీదేవీ బయోపిక్‌ను ఎందుకు తెరకెక్కించలేదు.. అసలు కారణం చెప్పిన రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మ.. కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలవడం వర్మకు మాత్రమే దక్కుతుంది. ఏ కాంట్రవర్సీ లేకుంటే ఏదో ట్వీట్‌ (Tweet) చేసి మరీ కాంట్రవర్సీకి తెర తీస్తుంటాడు వర్మ. ఇక వర్మ తెరకెక్కించే సినిమాలు..

RGV: శ్రీదేవీ బయోపిక్‌ను ఎందుకు తెరకెక్కించలేదు.. అసలు కారణం చెప్పిన రామ్ గోపాల్ వర్మ..
Rgv Sridevi
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 01, 2022 | 8:36 AM

Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మ.. కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలవడం వర్మకు మాత్రమే దక్కుతుంది. ఏ కాంట్రవర్సీ లేకుంటే ఏదో ట్వీట్‌ (Tweet) చేసి మరీ కాంట్రవర్సీకి తెర తీస్తుంటాడు వర్మ. ఇక వర్మ తెరకెక్కించే సినిమాలు ఎంతటి సంచనాలకు తెర తీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ‘డేంజరస్‌’ (మా ఇష్టం) పేరుతో మరో సంచలనానిక తెర తీశాడు వర్మ. అప్సరా రాణి, నైనా గంగూలీ నటించిన ఈ సినిమాను లెస్బియన్‌ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు రూపొందించారు. బుధవారం ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేసిన వర్మ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఇండియన్‌ తొలి లెస్బియన్‌ సినిమాగా చెబుతున్న ఈ చిత్రానికి సంబంధించి వర్మ మాట్లాడుతూ.. ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్స్‌గా ఎందుకు మారుతారు, వారిని సమాజం ఎలా చూస్తుంది, వారి సమస్య ఏమిటి? అనే అంశాలను ఈ సినిమా చూపించామని తెలిపారు. ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచన నాదే అయినప్పటికీ.. ఈ తరహా పాత్రల్లో నటించేందుకు ముందుకు వచ్చిన ఈ ఇద్దరు హీరోయిన్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు వర్మ. ఇక బయోపిక్‌లకు పెట్టింది పేరైన వర్మ.. సమాజంలో జరిగే అంశాలను సినిమాగా తెరకెక్కిస్తుంటారు.

ఇప్పటికే పలు బయోపిక్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించారు కూడా. అయితే దివంగత నటి శ్రీదేవిని తన ఆరాధ్య నటిగా చెప్పుకునే వర్మ ఆ విషయంలో మాత్రం ఇంత వరకు ఆలోచన చేయలేదు. అందరి బయోపిక్‌లను తెరకెక్కించే వర్మ శ్రీదేవి జీవిత ఆధారంగా మాత్రం సినిమాను తెరకెక్కించలేదు. తాజాగా మీడియా నుంచి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు స్పందించిన వర్మ.. ‘నేను శ్రీదేవి వీరాభిమానిని. అందుకే శ్రీదేవి బయోపిక్‌ తీయాలనే ఆలోచన భావన వచ్చింది. కానీ, శ్రీదేవి లాంటి హీరోయిన్‌ లేకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాను’ అని చెప్పుకొచ్చారు.

Also Read: BEL Recruitment: ఇంజనీరింగ్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Hair Care Tips: పురుషులకు వార్నింగ్.. ఈ ఐదు ఫుడ్స్ మీ జుట్టును బలహీనపరుస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

Paytm Offer: పేటీఎం బంపర్ ఆఫర్.. డబ్బులు చెల్లించకుండానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..