BEL Recruitment: ఇంజనీరింగ్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

BEL Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఏప్రిల్‌6తో..

BEL Recruitment: ఇంజనీరింగ్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Bel Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 01, 2022 | 7:31 AM

BEL Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఏప్రిల్‌6తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రైనీ ఇంజినీర్‌ (26), ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (37) ఖాళీలు ఉన్నాయి.

* ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో నాలుగేళ్ల బీఈ, బీటెక్‌, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28, 32 ఏళ్ల లోపు వారై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు ఘజియాబాద్‌లోని బీఈఎల్‌ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 06-04-2022ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: వీడెవడ్రా బాబూ.. ‘బాహుబలి’కే బాప్‌లా ఉన్నాడు..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం

Airtel Tech Mahindra: చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా.. 5జీ సేవలతో పాటు..

PM Narendra Modi: ‘పరీక్షా పే చర్చ’ ఈ రోజే.. విద్యార్థులతో నేరుగా సంభాషించనున్న ప్రధాని మోదీ..