Viral Video: వీడెవడ్రా బాబూ.. ‘బాహుబలి’కే బాప్‌లా ఉన్నాడు..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం

Amazing Stunt Video: ఇటీవల కాలంలో చాలా మంది ఫేమస్ అవ్వడం కోసం రకరకాల స్టంట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతుంటాయి.

Viral Video: వీడెవడ్రా బాబూ.. ‘బాహుబలి’కే బాప్‌లా ఉన్నాడు..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం
Viral Video
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Apr 01, 2022 | 6:50 AM

Amazing Stunt Video: ఇటీవల కాలంలో చాలా మంది ఫేమస్ అవ్వడం కోసం రకరకాల స్టంట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ఇలా స్టంట్ చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి స్టంట్‌లకు సంబంధించిన వీడియోలను మనం తప్పనిసరిగా చూస్తుంటాం.. ఇందులో చాలా మంది వ్యక్తులు బైక్‌లపై, మరికొంత మంది సైక్లింగ్ ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఇంకొంతమంది ఎత్తైన, ప్రమాదకరమైన కొండలపై కూడా విన్యాసాలు చేస్తుంటారు. వాటిని చూసిన తర్వాత ఇలా చేయడం అస్సలు సాధ్యం కాదని.. అమేజింగ్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తారు. అలాంటి ఒక స్టంట్ వీడియో తాజాగా సోషల్ మీడియా (Social Media) లో బాగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్యక్తి ఏనుగు (Elephant) పైకి ఎక్కి అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నాడు. బ్యాక్‌ఫ్లిప్ చేయడం లాంటివి మనం చేసే ఉంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా ఏనుగుపైనే బ్యాక్‌ఫ్లిప్ చేస్తూ కనిపించాడు. ఏనుగు మొదట స్టంట్ చేసే వ్యక్తి కోసం కాస్త కిందకు వంగి ఉంటుంది. ఆ తర్వాత వ్యక్తి పరుగున వచ్చి దాని పైకి ఎక్కి స్టంట్ చేస్తాడు. ఇందులో, ఏనుగు కూడా అతనికి చాలా సహకరిస్తుంది. ఈ వ్యక్తి గాలిలో 2-3 రౌండ్లపాటు బ్యాక్‌ఫ్లిప్ కొట్టాడు. ఆ తర్వాత ఏనుగుపైన నిలబడతాడు. అతని బ్యాలెన్స్ అద్భుతంగా కనిపిస్తుంది. అతను ఏనుగుపై నేరుగా ల్యాండ్ అయ్యే విధంగా బ్యాక్‌ఫ్లిప్‌ను కొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వైరల్ వీడియో..

ఈ అద్భుతమైన వీడియోను ఎలిఫెంట్.లవర్.లవర్ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కేవలం 7 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షకు పైగా వీక్షించగా.. వేలాది మంది లైక్ చేస్తున్నారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తూ.. స్టంట్‌మెన్ బాహుబలిలా ఉన్నాడంటూ అభినందిస్తున్నారు.

Also Read:

Viral Video: చిరుత పులి- బ్లాక్ పాంథర్ ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? డేంజరస్ వీడియో

Viral Video: తగ్గేదెలే.. పుష్ప సాంగ్‌కు స్టెప్పులేసిన చింపాంజీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..