తీరు మారని రాయల్ చాలెంజర్స్.. కొత్త సీజన్‌లో ఓటమితో ఆరంభం

తీరు మారని రాయల్ చాలెంజర్స్.. కొత్త సీజన్‌లో ఓటమితో ఆరంభం

చెన్నై: ఐపీఎల్‌ అంటే ధనాధన్‌ షాట్లు… ఫటాఫట్‌ మెరుపులు… కానీ ఆనవాయితీకి భిన్నంగా, విధ్వంసానికి విరుద్ధంగా 12వ సీజన్‌ మొదలైంది. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. కోహ్లి, డివిలియర్స్‌లాంటి బ్యాటింగ్‌ హేమాహేమీలున్న జట్టుపై ధోని సేన స్పిన్‌తో విన్నయింది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 24, 2019 | 7:19 AM

చెన్నై: ఐపీఎల్‌ అంటే ధనాధన్‌ షాట్లు… ఫటాఫట్‌ మెరుపులు… కానీ ఆనవాయితీకి భిన్నంగా, విధ్వంసానికి విరుద్ధంగా 12వ సీజన్‌ మొదలైంది. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. కోహ్లి, డివిలియర్స్‌లాంటి బ్యాటింగ్‌ హేమాహేమీలున్న జట్టుపై ధోని సేన స్పిన్‌తో విన్నయింది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. పార్థివ్‌ పటేల్‌ (35 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌. హర్భజన్, ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో 3 వికెట్లు తీయగా… రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (42 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. హర్భజన్‌ సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu