AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్టు ఇదే.. టీమిండియా ప్లేస్ ఎక్కడంటే?

ICC Champions Trophy 2025 All Squads: ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాలు పూర్తి చేశాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. టీమిండియా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఈ టోర్నీని మొదలుపెట్టనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై సిరీస్ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉంది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన జట్టు ఇదే.. టీమిండియా ప్లేస్ ఎక్కడంటే?
icc champions trophy 2025 all squads
Venkata Chari
|

Updated on: Feb 13, 2025 | 1:04 PM

Share

ICC Champions Trophy 2025 All Squads: 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. ఈ ఏడాది తొమ్మిదవ ఎడిషన్ జరుగుతోంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. పాకిస్తాన్ మూడు వేదికలలో (కరాచీ, లాహోర్, రావల్పిండి) ఎక్కువ మ్యాచ్‌లను నిర్వహిస్తుండగా.. భారత జట్టు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో తమ మ్యాచ్‌లను ఆడుతుంది.

ఇందులో పాల్గొనే ఎనిమిది దేశాలను నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బీ లో ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. భారత జట్టు అర్హత సాధిస్తే ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుంది. లేకపోతే ఫైనల్ పోరు లాహోర్‌లో జరుగుతుంది.

ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2017లో ది ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2025 ఎడిషన్ కరాచీలో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

2025 ఛాంపియన్స్ ట్రోఫీ: ఎనిమిది జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

గ్రూప్ ఏ..

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.

నాన్ ట్రావెలింగ్ ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివమ్ దూబే

పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ షాహస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా, షాహీన్.

బంగ్లాదేశ్: సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా, జాకర్ అలీ, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్ఫిజుర్ రహ్సాన్, తజ్న్ హస్సాన్, తస్కీన్, అహ్మద్.

న్యూజిలాండ్: మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, విల్ ఓ’రూర్కే, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, లాకీ ఫెర్గూసన్.

గ్రూప్ బి..

ఆస్ట్రేలియా : స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా

ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడి, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, ట్రిస్టన్ స్టబ్స్, ఆర్‌స్సేన్ కోర్స్‌వాన్, ఆర్స్సేన్ స్టబ్స్

ట్రావెలింగ్ రిజర్వ్: క్వేనా మఫాకా

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జాకబ్ బెథెల్

ఆఫ్ఘనిస్థాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెడిఖుల్లా అటల్, రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటే, నంగ్యాల్ ఖరోతే, ఫజల్ హాఖోత్ మాలిక్, నవీద్ జద్రాన్.

రిజర్వ్‌లు: దర్విష్ రసూలి, బిలాల్ సామి.

బలమైన జట్టు ఏదంటే?

అన్ని జట్ల స్వ్కాడ్స్ పరిశీలిస్తే భారత జట్టు బలంగా కనిపిస్తోంది. భారత జట్టుతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్టు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే, పాకిస్తాన్ మెగా ట్రోర్నీలో ఎప్పుడు ఎలా ఆడుతుంతో తెలియదు. ఇక ఈ కోవలోకి మరో జట్టు చేరింది. బలమైన ఆటగాళ్లతో సౌతాఫ్రికా జట్టు కూడా సిద్ధంగా ఉంది. అంటే, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్నో ఉత్కంఠ భరిత మ్యాచ్‌లను చూడొచ్చన్నమాట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us