AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన స్వ్కాడ్ ఏది? ఆ జట్టుదే ట్రోఫీ అంటోన్న లిటిల్ మాస్టర్

Champions Trophy 2025 Squads: ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లను ఇప్పటికే ప్రకటించారు. పాకిస్థాన్ మాత్రం తన జట్టును ప్రకటించలేదు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన స్వ్కాడ్ ఏది? ఆ జట్టుదే ట్రోఫీ అంటోన్న లిటిల్ మాస్టర్
Champions Trophy 2025 Squad
Venkata Chari
|

Updated on: Jan 18, 2025 | 4:15 PM

Share

Champions Trophy: ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఎట్టకేలకు టీమిండియాను ప్రకటించారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ ఐసీసీ ఈవెంట్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. ఇప్పుడు టీమిండియా ప్రకటనతో పాటు, 7 జట్ల జాబితా కూడా బయటకు వచ్చింది. అంతే కాకుండా ఆతిథ్య పాకిస్థాన్‌ మాత్రమే ఇంకా జట్టును ప్రకటించలేదు. పాకిస్థాన్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తమ తమ జట్లను ప్రకటించగా, ఒక్కో జట్టులో ఎవరికి అవకాశం దక్కిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

7 జట్ల జాబితా ఇదే..

ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ .

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్, విలియం ఒరోక్ మాట్ హెన్రీ, మైఖేల్ బ్రేస్‌వెల్.

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తాంజిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నస్ నస్ హబ్సాన్, తస్కిన్ హస్సేన్.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సైదుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదీన్ నైబ్, ఎఎమ్ గజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీద్ జద్రాన్ మరియు ఫరీద్ అహ్మద్ మాలిక్.

రిజర్వ్‌లు: దర్విష్ రసౌలీ, నంగ్యాల్ ఖరోటి మరియు బిలాల్ సామి.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రిజ్ షమ్సీ, కగిసో రబాదా , వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, లుంగి ఎన్గిడి.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, యస్సవి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

డిఫెండింగ్ ఛాంపియన్‌కే అవకాశాలు ఎక్కువ..

దాదాపు అన్ని జట్ల స్వ్కాడ్ (పాక్ మినహా) వచ్చిన అనంతరం, టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ గవాస్కర్ బిగ్ షాకిచ్చాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌ అంటే పాకిస్తాన్ జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..