IND vs AUS: చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు షమీ.. క్లారిటీ ఇచ్చిన రోహిత్

ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు మ్యాచ్‌లకు షమీ జట్టులోకి వస్తాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టీమిండియ జట్టులో మరో సీనియర్ పేసర్ లేకపోవడం జట్టును తొలి టెస్టు నుంచే ఇబ్బంది పెడుతోంది. బుమ్రాతో పాటు సిరాజ్ ఉన్నా ఆశించినంతగా రాణించడం లేదు.

IND vs AUS: చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు షమీ.. క్లారిటీ ఇచ్చిన రోహిత్
Rohit Sharma On Shami
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 19, 2024 | 7:48 AM

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యమే ఆ జట్టు పేలవ ప్రదర్శనకు కారణమనడంలో సందేహం లేదు. జట్టు బ్యాటర్లు ఎవరూ నిలకడగా రాణించడం లేదు. మరోవైపు  జట్టులో మరో సీనియర్ పేసర్ లేకపోవడం జట్టును తొలి టెస్టు నుంచే ఇబ్బంది పెడుతోంది. టీమిండియా  బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన వారి నుండి నిలకడగా ప్రదర్శన లేదు. బుమ్రాతో పాటు, సిరాజ్ జట్టులో మరొక పేసర్.. అయితే సిరాజ్ అవసరమైనప్పుడు వికెట్లు తీయకపోవడంతో జట్టుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనితో తోడు ఆ భారమంతా బుమ్రాపై పడి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో బుమ్రాతో వికెట్లు తీయడానికి మరో పేసర్ మహమ్మద్ షమీని ఆస్ట్రేలియాకు ఆహ్వానించాలని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే షమీ జట్టులోకి వస్తాడా లేదా అనే దానిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

షమీ అందుబాటులో ఉండటం గురించి విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడారు. షమీ గురించి NCA నుంచి ఫుల్ క్లారిటీ వచ్చే వరకు ఆస్ట్రేలియాకు పిలువబోమని రోహిత్ చెప్పాడు. NCA నుండి షమీ గురించి కొత్త అప్‌డేట్ వస్తే జట్టులోకి తీసుకుంటామని ఆయన  స్పష్టం చేశారు. “షమీ భారత్‌లో జరుగుతున్న టోర్నీ మ్యాచ్‌ల్లో బాగా ప్రదర్శన చేస్తున్నాడని తెలుసు. అయితే అతని మోకాలికి సమస్య ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇక్కడికి వచ్చి మ్యాచ్ మధ్యలోనే జట్టు నుంచి తప్పుకోవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము అలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. షమీ 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారణ అయిన తర్వాతే జట్టులో ఆడతానని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.

ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు షమీ జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. కానీ శనివారం నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ కోసం బెంగాల్ జట్టులో అతను ఎంపికయ్యాడు. షమీ ఆస్ట్రేలియా వెళ్లడని స్పష్టం చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా