Team India: “అతనే భారతదేశ భవిష్యత్తు”: యువ బ్యాట్స్‌మన్‌పై కపిల్ దేవ్ ప్రశంసలు..
Shubman Gill: 2023 సంవత్సరం శుభ్‌మన్ గిల్‌కి చాలా బాగుంది. గిల్ ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 18 ODI మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 70.13 సగటు, 104.05 స్ట్రైక్ రేట్‌తో 1052 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను నాలుగు సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌పై అతను చేసిన 208 పరుగులు అత్యధిక స్కోరుగా నిలిచింది. అతని అద్భుతమైన ఫామ్ కారణంగా, భారత క్రికెట్ అభిమానులందరూ ప్రపంచ కప్ 2023 కోసం శుభ్‌మాన్ గిల్ నుంచి భారీ అంచనాలు ఆశిస్తున్నారు. కపిల్ దేవ్ కూడా ఇలాంటి ఆశలే పెట్టుకున్నాడు.

1983లో భారత క్రికెట్ జట్టుకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ యువ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల జల్లు కురిపించి, అభిమానిగా మారాడు. గత ఏడాది కాలంగా శుభ్‌మన్ గిల్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ (Asia Cup 2023)లో కూడా శుభ్‌మాన్ బ్యాట్ మంచి ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, భారత జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ, ఆ మ్యాచ్‌లో ఈ యువ బ్యాట్స్‌మెన్ ప్రశంసనీయమైన సెంచరీని సాధించాడు.
గిల్‌పై కపిల్ దేవ్ ప్రశంసలు..
24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేశాడు. అతను ఆరు ODI మ్యాచ్‌ల ఒకే ఇన్నింగ్స్‌లో 75.50 సగటు, 93.49 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 302 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన 121 పరుగులే అతని అత్యుత్తమ స్కోరు.




అతని అద్భుతమైన ఫామ్ కారణంగా, భారత క్రికెట్ అభిమానులందరూ ప్రపంచ కప్ 2023 కోసం శుభ్‌మాన్ గిల్ నుంచి భారీ అంచనాలు ఆశిస్తున్నారు. కపిల్ దేవ్ కూడా ఇలాంటి ఆశలే పెట్టుకున్నాడు.
View this post on Instagram
ఆసియా కప్‌లో అతని ప్రదర్శన చూసిన తర్వాత శుభ్‌మాన్ గురించి కపిల్ పిటిఐతో మాట్లాడుతూ, “శుభ్మన్‌ను మనం స్ఫూర్తిగా తీసుకోగల యువ ఆటగాడు. అతను భారత క్రికెట్ భవిష్యత్తు. అతని స్థాయి ఆటగాడిని కలిగి ఉన్నందుకు భారతదేశం చాలా గర్వపడుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
2023 సంవత్సరం శుభ్‌మన్ గిల్‌కి చాలా బాగుంది. గిల్ ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 18 ODI మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 70.13 సగటు, 104.05 స్ట్రైక్ రేట్‌తో 1052 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను నాలుగు సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌పై అతను చేసిన 208 పరుగులు అత్యధిక స్కోరుగా నిలిచింది.
View this post on Instagram
ఆస్ట్రేలియాతో సిరీస్‌నకు ఎంపికైన టీం ఇండియా వివరాలు ఎలా ఉన్నాయంటే..
తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమ్మీ, తిలక్ కృష్ణ, పర్షిద్‌వర్మ, పర్షిద్‌వర్మ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ (ఫిట్ అయితే).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




