AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoaib Akhtar: ఏంటి ఆ పేసర్ పుట్టుకతోనే వికలాంగుడా? దిమ్మతిరిగే నిజాలు బయట పెట్టిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్!

షోయబ్ అక్తర్ తన బాల్యంలో వికలాంగుడిగా పుట్టాడని, 9వ ఏట ఒక అద్భుతం జరిగి పరిగెత్తడం ప్రారంభించానని వెల్లడించాడు. అతను 2003 ప్రపంచకప్‌లో 161.3 కిమీ వేగంతో బౌలింగ్ చేసి, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు టెస్ట్ క్రికెట్‌లో వేగాన్ని పెంచుకోవాలని లేదా వైట్-బాల్ క్రికెట్‌కే కట్టుబడాలని సలహా ఇచ్చాడు. షోయబ్ అక్తర్ కథ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.

Shoaib Akhtar: ఏంటి ఆ పేసర్ పుట్టుకతోనే వికలాంగుడా? దిమ్మతిరిగే నిజాలు బయట పెట్టిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్!
Akhtar
Narsimha
|

Updated on: Feb 08, 2025 | 7:26 PM

Share

పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ తన జీవితంలోని అద్భుత ఘట్టాన్ని తాజాగా వెలుగులోకి తీసుకువచ్చాడు. తాను వికలాంగుడిగా పుట్టానని, 8 సంవత్సరాల వయస్సు వరకు నడవలేకపోయానని షోయబ్ అక్తర్ షాకింగ్ రివలేషన్ ఇచ్చాడు. కానీ 9వ ఏట అతని జీవితంలో అద్భుతం జరిగిందని, తాను నడవడమే కాకుండా పరిగెత్తడం కూడా ప్రారంభించానని తెలిపారు.

షోయబ్ అక్తర్ తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ, తన జనన సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి చెప్పాడు. “మా ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆయన ఒకసారి ఇలా అన్నాడు – ‘ఒక వ్యక్తి వస్తాడు, అతను ప్రపంచవ్యాప్తంగా పేరును సంపాదిస్తాడు’. ఇది విన్న వెంటనే నా తల్లి భయపడి, ‘ఆ వ్యక్తి ఎవరు? అతను ఏమి చేస్తాడు?’ అని ప్రశ్నించింది” అని అక్తర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా vs పాకిస్తాన్” లో వెల్లడించాడు.

తన తల్లికి ఉన్న ఆందోళనకు కారణం తన ఆరోగ్య సమస్యలేనని షోయబ్ అక్తర్ గుర్తు చేసుకున్నాడు. “నేను పుట్టినప్పుడు వికలాంగుడిని. నడవలేకపోయాను. కానీ 9వ ఏట నాకు ఒక అద్భుతం జరిగింది – నేను పరిగెత్తడం ప్రారంభించాను. అంతే కాదు, నేను కాంతి వేగంతో పరిగెత్తేవాడిని” అని అక్తర్ చెప్పాడు.

అక్తర్ తన బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప పేస్ బౌలర్‌గా ఎదిగాడు. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రికార్డు ఇప్పటికీ షోయబ్ అక్తర్ వద్దే ఉంది. 2003 ప్రపంచ కప్‌లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను 161.3 కి.మీ (100.2 mph) వేగంతో బౌలింగ్ చేశాడు, ఇది ఇప్పటికీ ఓ అద్భుతమైన రికార్డుగా నిలిచింది.

అక్తర్ 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడి, 178, 247, 19 వికెట్లు సాధించాడు. అతని బౌలింగ్ సామర్థ్యం, వేగం ప్రపంచ క్రికెట్‌ను ఉర్రూతలూగించాయి.

జస్‌ప్రీత్ బుమ్రాకు అక్తర్ ఇచ్చిన సలహా

నేటి ఫాస్ట్ బౌలర్లలో అత్యుత్తములైన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి కూడా అక్తర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా వేగాన్ని పెంచుకోవాలి. లేదంటే అతను లెంగ్త్ సమస్యలతో ఇబ్బంది పడతాడు” అని అన్నారు.

అలాగే, బుమ్రా టెస్ట్ ఫార్మాట్‌ను వదిలేసి, వైట్-బాల్ క్రికెట్‌కే దృష్టి పెట్టాలని సూచించారు. “బుమ్రా వేగాన్ని పెంచితే గాయపడే అవకాశం ఎక్కువ. అతను నాకు సలహా అడిగితే, నేను చిన్న ఫార్మాట్‌లకే కట్టుబడి ఉండమని చెబుతాను” అని అక్తర్ TNKS పాడ్‌కాస్ట్‌లో చెప్పాడు.

షోయబ్ అక్తర్ జీవిత ప్రయాణం నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన కథ. చిన్నతనంలో వికలాంగుడిగా జన్మించినప్పటికీ, అద్భుతమైన లక్ష్య సాధనతో ప్రపంచంలోని అత్యుత్తమ స్పీడ్‌స్టర్‌గా ఎదిగాడు. క్రికెట్ ప్రపంచంలో మాత్రమే కాకుండా, జీవితంలోను అసాధ్యాన్ని సాధ్యం చేయగలమనే ఆత్మవిశ్వాసానికి ఆయన నిలువెత్తు నిదర్శనం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..