AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border-Gavaskar trophy: జస్ప్రిత్ బుమ్రా అద్భుతం.. ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడు అని పొగిడిన స్టీవెన్ ఫిన్

జస్ప్రిత్ బుమ్రా పర్త్ టెస్ట్‌లో ఎనిమిది వికెట్లు తీసి, భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు స్టీవెన్ ఫిన్ అతడిని ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా అభివర్ణించాడు. బుమ్రా అసాధారణ బౌలింగ్ శైలిని స్టీవ్ స్మిత్ సహా అనేక మంది ప్రఖ్యాత ఆటగాళ్లు ప్రశంసించారు.

Border-Gavaskar trophy: జస్ప్రిత్ బుమ్రా అద్భుతం.. ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడు అని పొగిడిన స్టీవెన్ ఫిన్
India vs Australia 5th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లతో చెలరేగిపోతున్నాడు. నాల్గవ టెస్ట్ నాటికి, బుమ్రా రెండు పెద్ద రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యంత వేగంగా 200 టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచి, ఐసీసీ రేటింగ్‌లో 907 పాయింట్లు సాధించాడు. తాజాగా మరో రెండు మెగా రికార్డులపై కన్నేశాడు. సిడ్నీ టెస్టులో బుమ్రా బ్రేక్ చేసే రికార్డుల వివరాలను ఓసారి చూద్దాం..
Narsimha
|

Updated on: Dec 02, 2024 | 11:44 AM

Share

భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, పర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో భారత్‌ కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. జట్టుకు నాయకత్వం వహించిన బుమ్రా మొత్తం ఎనిమిది వికెట్లు తీసి, మ్యాచ్ లో విజేతగా నిలిచాడు. మాజీ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా అభివర్ణించాడు.

“జైస్వాల్ అద్భుతమైన 161 పరుగులు చేశాడు. కానీ నాకు బాగా నచ్చిన ఆటగాడు, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా జస్ప్రిత్ బుమ్రా అని నా నేను భావిస్తున్నాను అని స్టీవెన్ ఫిన్ పేర్కొన్నాడు. బుమ్రా నిజంగా అద్భుతం, అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు నేను బ్యాటింగ్ ప్యాడ్స్ ధరించకపోవడమే మంచిదని అనిపిస్తోందని అని స్టీవెన్ ఫిన్ TNT స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ అన్నాడు.

భారత జట్టు ఆస్ట్రేలియాతో పర్త్‌లో విజయదాయక ఆటతీరును గమనించిన మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టైర్ కుక్, టీమిండియా ధైర్యసాహసాలను ప్రశంసించాడు. “పర్త్ వంటి స్టేడియలో ఆస్ట్రేలియాను భారీగా ఓడించడం చాలా పెద్ద విషయం. ఇది వాకా కాదు, కొత్త స్టేడియమే అయినప్పటికీ, చారిత్రాత్మకంగా ఆస్ట్రేలియా అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తుంది,” అని కుక్ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా బుమ్రా గురించి మాట్లాడుతూ, అతడి అసాధారణ బౌలింగ్ శైలిని ప్రశంసించాడు. “బుమ్రా పరుగులను నియంత్రించడం దగ్గర్నుంచి అతడి బౌలింగ్ యాక్షన్ వరకు, ప్రతి అంశం అసాధారణం. అతడి శైలిని అర్థం చేసుకోవడానికి ప్రతిసారి కొన్ని బంతులు ఎదుర్కోవసలి వస్తుందని అని స్మిత్ వివరించాడు.

పర్త్ టెస్ట్‌లో బుమ్రా ఎనిమిది వికెట్లు తీసి, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించి, 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.