Border Gavaskar Trophy: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ ప్రారంభమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య అడిలైడ్ ఓవల్‌లో ఇది రెండో మ్యాచ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు తొలి బంతికే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం మరోసారి టీమిండియాకు భారంగా మారే అవకాశం ఉంది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి ప్రారంభమైంది. పింక్ బాల్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టు ఇది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, మిచెల్ స్టార్క్ మ్యాచ్ తొలి బంతికే యశస్వి జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పిచ్‌పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంది. అది కూడా మేఘావృతమై ఉంది. ఈ పరిస్థితిలో పింక్ బాల్ మరింత ప్రాణాంతకం అని నిరూపించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ మొదట బౌలింగ్ చేయడం సరైన నిర్ణయం అయి ఉండవచ్చు. క్రమంగా పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా ఉండేది.
అయితే, రోహిత్ నిర్ణయం అనేక ప్రశ్నలను మిగిల్చింది. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం టీమ్ ఇండియాకు ప్రమాద గంటగా మారుతుందా? న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సమయంలో రోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 16 నుంచి బెంగళూరులో ప్రారంభమైంది. బెంగళూరు పిచ్ న్యూజిలాండ్ బౌలర్లకు సహాయకరంగా ఉండడంతో భారత జట్టు కేవలం 44 పరుగులకే ఆలౌటైంది. అప్పుడు కూడా, రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు కూడా చేయలేకపోయింది.
బెంగళూరు టెస్టు సందర్భంగా కూడా వర్షం కురిసి దట్టమైన మేఘాలు కమ్ముకోవడం గమనార్హం. పిచ్‌ను కొద్దిరోజుల పాటు కవర్‌తో కప్పారు. దాని కారణంగా తేమ ఉంది. అంటే న్యూజిలాండ్‌కు వాతావరణం నుంచి పూర్తి మద్దతు లభించింది. టీమ్ ఇండియాను కివీ జట్టు వెనుకకు నెట్టింది. 2020 డిసెంబర్‌లో అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
డిన్నర్‌లోపు 4 వికెట్లు కోల్పోయిన భారత్, ఆ తర్వాత రోహిత్ రూపంలో మరో వికెట్‌ను కూడా కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం పంత్ 12, నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 0, రాహుల్ 37, గిల్ 31, కోహ్లీ 7, రోహిత్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు వాతావరణాన్ని చక్కగా ఉపయోగించుకుని భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. మిచెల్ స్టార్క్ 3, బోలాండ్ 2 వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..