టీ20ల్లో అత్యంత చెత్త మ్యాచ్‌లు.. వరల్డ్ రికార్డులు బద్దలు.. అవేంటంటే.?
క్రికెట్‌లో ఎప్పుడు.? ఏం జరుగుతుందో.? ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్‌లలో విధ్వంసం జరుగుతుందని ఊహిస్తే..

క్రికెట్‌లో ఎప్పుడు.? ఏం జరుగుతుందో.? ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్‌లలో విధ్వంసం జరుగుతుందని ఊహిస్తే.. అది కాస్తా చివరికి రివర్స్ అవుతుంది. టీ20 ఫార్మాట్ అంటేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అయితే ఇక్కడ కొంచెం భిన్నంగా జరిగింది. ఓ టీం కేవలం 15 పరుగులకే ఔటైతే వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది.
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 బిగ్ బాష్ లీగ్‌లో ఈ ఫీట్ నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ జట్టు కేవలం 35 బంతుల్లో 15 పరుగులకే ఆలౌటైంది. ఇది పురుషుల T20 క్రికెట్‌లో(అంతర్జాతీయ/దేశీయ) అతి తక్కువ స్కోరు కావడం విశేషం. అలాగే ఈ జట్టు టీ20లలో అందరికంటే అత్యల్ప స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డు సృష్టించింది.
అంతకుముందు పురుషుల టీ20లో అతి తక్కువ స్కోరు రికార్డు టర్కీ పేరిట ఉండేది. 2019 ఆగస్టు 30న చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ మొత్తం 8.3 ఓవర్లలో కేవలం 21 పరుగులకే ఆలౌటైంది. అదే విధంగా 2021లో రువాండాతో జరిగిన మ్యాచ్‌లో సీషెల్స్ 23 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో సీషెల్స్ కేవలం 9 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది.
మరోవైపు 2011లో ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ కౌంటీ జట్టు సోమర్‌సెట్ 6 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఆ సమయంలో పురుషుల టీ20లో అతి తక్కువ స్కోర్‌గా నిలిచింది. అలాగే అబోటాబాద్ ఫాల్కన్స్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఈ జట్టు ఫిబ్రవరి 2014లో జరిగిన మ్యాచ్‌లో 5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేయగలిగింది.
