Ind Vs NZ : ఐదుగురు స్టార్లకు అన్యాయం..బీసీసీఐపై ఫ్యాన్స్ అటాక్.. సెంచరీ కొట్టినా వేటు వేస్తారా?
Ind Vs NZ : బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్ పేరు లేకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.

Ind Vs NZ : బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్ పేరు లేకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విరుచుకుపడుతున్నారు. కేవలం గైక్వాడ్ మాత్రమే కాదు, వరుస సెంచరీలతో ఫామ్‌లో ఉన్న మరో నలుగురు స్టార్ ఆటగాళ్లను కూడా పక్కన పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు సెలక్టర్ల మైండ్‌లో ఏముంది? ఇంతటి అన్యాయం ఎందుకు జరుగుతోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెంచరీ కొట్టినా దక్కని చోటు
సౌతాఫ్రికాతో జరిగిన రాయ్‌పూర్ వన్డేలో 105 పరుగులతో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టు నుంచి తప్పించడం ఎవరూ ఊహించని పరిణామం. గైక్వాడ్ కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే కాదు, ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ చెలరేగిపోతున్నాడు. ఉత్తరాఖండ్‌పై 124 పరుగులు, ముంబైపై 66 పరుగులు చేసి మహారాష్ట్రను గెలిపించినా, సెలక్టర్లు మాత్రం అతడిని కనికరించలేదు. “సెంచరీ కొట్టడం గైక్వాడ్ చేసిన తప్పా?” అంటూ నెటిజన్లు బీసీసీఐని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
సెలక్షన్ రోజే సెంచరీలు.. అయినా నో ఛాన్స్
విచిత్రం ఏంటంటే, జట్టును ప్రకటించిన రోజే ముగ్గురు ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌లో సెంచరీలు బాది తమ సత్తా చాటారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ ముగ్గురూ శనివారం విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలు చేశారు. కానీ సెలక్టర్ల జాబితాలో వీరి పేర్లు ఎక్కడా లేవు. అక్షర్ పటేల్ లాంటి నమ్మకమైన ఆల్ రౌండర్‌ను, తిలక్ వర్మ లాంటి యువ సెన్సేషన్‌ను పక్కన పెట్టడం వెనుక ఉన్న మతలబు ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.
షమీ రీఎంట్రీ కేవలం పుకార్లేనా?
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తిరిగి జట్టులోకి వస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ తుది జట్టులో షమీ పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. షమీ రాక గురించి వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది. సంజు శాంసన్ విషయంలో కూడా సెలక్టర్లు పాత పద్ధతినే అనుసరిస్తున్నారని, ఎన్ని సెంచరీలు చేసినా అతడిని విస్మరిస్తున్నారని కేరళ అభిమానులు మండిపడుతున్నారు.
🚨 News 🚨
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
— BCCI (@BCCI) January 3, 2026
🚨Why was Ruturaj Gaikwad not picked in the ODI squad after scoring a century in the last match?👀
This is Gautam Gambhir’s clear favoritism – players who perform don’t get a chance, while those who don’t are given multiple opportunities
SHAME ON BCCI✅pic.twitter.com/AIj76Z8Ndg
— Mention Cricket (@MentionCricket) January 3, 2026
ట్విట్టర్‌లో ట్రెండింగ్
బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో JusticeForRuturaj, ShameOnBCCI వంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. గైక్వాడ్ లాంటి నిలకడైన ఆటగాడిని ఏ ప్రాతిపదికన తప్పించారని సెలక్టర్లను నెటిజన్లు నిలదీస్తున్నారు. గిల్, రోహిత్, కోహ్లీ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఫామ్‌లో ఉన్న యువకులను పక్కన పెట్టడం వరల్డ్ కప్ సన్నాహాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
