రోహిత్ ఇక సర్దుకో..! వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవలని బీసీసీఐ నుంచి ఆదేశాలు?
రోహిత్ శర్మ 2024 T20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన తరువాత, వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ, 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ లేదా శుభ్‌మన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది.

టీమిండియాకు రెండు వరుస ఏడాదుల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. 2024 టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్లను రోహిత్ శర్మనే నడిపించాడు. టీ20 వరల్డ్ కప్ గెలవగానే పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇటీవలె టెస్ట్ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడి.. ఆ కప్పు గెలిచి, తన ఖాతాలో లేని వన్డే వరల్డ్ కప్ గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. కానీ, ఇప్పుడు రోహిత్ కలపై బీసీసీఐ నీళ్లు చల్లే సూచనలు కనిపిస్తున్నాయి.
వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పుకోమని బీసీసీఐ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. బీసీసీఐ నిర్ణయంపై రోహిత్ శర్మ కూడా షాక్ తిన్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్లో సరిగ్గా రన్స్ చేయలేకపోతున్నాడని, తనకు తానే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. తనకు ఎంతో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో కొనసాగాలని అనుకున్నాడు. కానీ, ఇప్పుడు బీసీసీఐ మాత్రం రోహిత్ ప్లాన్‌ను ముక్కలు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. అందుకోసం మొత్తం టీమ్‌తో పాటు.. కెప్టెన్‌ను కూడా రెడీ చేయాలని భావిస్తోంది.
రోహిత్ శర్మ వయసు దృష్ట్యా అతను ఎక్కువ కాలం టీమ్‌లో కొనసాగే అవకాశం లేదు, 2027 కల్లా రోహిత్ శర్మ 40 ఏళ్లకు చేరుకుంటాడు. ఆ వయసులో అంత ఎఫెక్టివ్ క్రికెట్, 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ అంటే కష్టం అయ్యే అవకాశం ఉంది. అందుకే.. రోహిత్ శర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా గిల్‌ను వన్డే జట్టుకు కెప్టెన్‌గా చేసి.. 2027 వన్డే వరల్డ్ లక్ష్యంగా రెడీ అవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ విషయమై రోహిత్ శర్మతో సంప్రదించినట్లు తెలుస్తుంది. రానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లోనే టీమిండియాకు కొత్త వన్డే కెప్టెన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వేల అయ్యర్‌ను వన్డే టీమ్‌కు కెప్టెన్ చేస్తే.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అనే కాన్సెప్ట్ అమలులోకి వచ్చేసినట్లు. ఒక రకంగా ఇది రోహిత్ ఫ్యాన్స్‌కు గట్టి షాక్ అనే చెప్పాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..