IPL ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు, BCCI ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నాకౌట్ మ్యాచుల్లో నమోదైన ప్రతి డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటనున్నట్లు తెలిపింది. టాటా కంపెనీ భాగస్వామ్యంతో ఈ మంచి కార్యక్రమానికి నడుం బిగించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీని కారణంగానే ప్లేఆఫ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఎన్ని డాట్ బాల్స్ ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే నాకౌట్ మ్యాచుల్లో ఎన్ని డాబ్ బాల్స్ పడ్డాయో లెక్కేద్దాం రండి.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన , సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో మొత్తం 73 డాట్ బాల్స్ నమోదయ్యాయి.
ఇదే మోడీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో మొత్తం 74 డాట్ బాల్స్ పడ్డాయి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన రెండో క్వాలి ఫైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొత్తం 96 డాట్ బాల్స్ నమోదయ్యాయి.
ఇక ఇదే స్టేడియం వేదికగా ఆదివారం (మే 26) కోల్ కతా నైటర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో మొత్తం 80 డాట్ బాల్స్ వచ్చాయి.
🎥 𝐆𝐎𝐃’𝐒 𝐏𝐋𝐀𝐍, 𝐟𝐭 𝐑𝐢𝐧𝐤𝐮 𝐒𝐢𝐧𝐠𝐡 💜
Unfiltered joy & pure adoration like a child’s dream coming true 😇✨
One dream ✅, On to the next one now ⏳#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders | @rinkusingh235 pic.twitter.com/gkvOztSkWS
— IndianPremierLeague (@IPL) May 27, 2024
అంటే ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నమోదైన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 323. ఇక్కడ ఒక్కో డాట్ బాల్‌కు 500 చెట్లను నాటాలని బీసీసీఐ ప్రకటించింది. ఈ లెక్క ప్రకారంటాటా సంస్థ భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 మొక్కలు నాటనుంది. కాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦
Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹
What it feels to win the #TATAIPL Final 💜
Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz
— IndianPremierLeague (@IPL) May 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..