Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ బిగ్ షాక్.. ఇకపై వాటిని వాడొద్దంటూ హెచ్చరికలు..

BCCI: బీసీసీఐ తన రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కఠినమైన సూచనలు ఇచ్చింది. ఐపీఎల్ 2025ను దృష్టిలో ఉంచుకుని, లెజెండ్స్ లీగ్, సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లకు స్థానిక మ్యాచ్‌లకు మైదానాలను కేటాయించవద్దని బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలను కోరింది. ఐపీఎల్ జట్లకు కూడా బీసీసీఐ పెద్ద దెబ్బ వేసింది.

IPL 2025: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ బిగ్ షాక్.. ఇకపై వాటిని వాడొద్దంటూ హెచ్చరికలు..
Ipl 2025 Said Do Not Allow
Follow us
Venkata Chari

|

Updated on: Feb 09, 2025 | 4:28 PM

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి దాదాపు ఒకటిన్నర నెలల ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఓ కఠినమైన సూచనను ఇచ్చింది. ఐపీఎల్ కోసం కేటాయించిన మైదానాలను లెజెండ్స్ లీగ్, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలైన వాటికి అందుబాటులో ఉంచకూడదని బీసీసీఐ రాష్ట్ర సంఘాలను హెచ్చరించింది. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కూడా పెద్ద దెబ్బ వేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకారం, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా ప్రాక్టీస్ కోసం మైదానాలు కేటాయించదు. ఈ మేరకు బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఈ-మెయిల్ కూడా పంపింది.

రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ ఈ-మెయిల్..

ఈ విషయంపై బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఈ-మెయిల్ పంపింది. మైదానం, అవుట్ ఫీల్డ్ శుభ్రంగా ఉండాలని బీసీసీఐ ఈ-మెయిల్‌లో పేర్కొంది. అయితే, ఇప్పటికే షెడ్యూల్ చేసిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ప్రధాన స్క్వేర్, అవుట్‌ఫీల్డ్‌ను ఉపయోగించుకోవచ్చని బీసీసీఐ కూడా తెలిపింది. కానీ, ఐపీఎల్ జట్లు, లెజెండ్స్ లీగ్, స్థానిక మ్యాచ్‌లు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలైన వాటి ప్రాక్టీస్ సెషన్‌లకు మైదానాలను ఉపయోగించడం నిషేధించింది.

IPL 2025 మ్యాచ్‌లు ఈ ప్రదేశాల్లోనే..

‘ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను మంచి స్థితిలో నిర్వహించడం అవసరం’ అని బీసీసీఐ తన ఆదేశాలలో పేర్కొంది. IPL వేదికలు ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB), ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA), పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA), రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA), ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA), గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA), తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)ల్లోనే జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ జట్లకు భారీ షాక్..

బీసీసీఐ ఈ కఠినమైన సూచన తర్వాత, ఐపీఎల్ జట్లకు అతిపెద్ద షాక్ తగిలింది. ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. గతంలో, ఐపీఎల్ జట్లు వారి వారి మైదానాల్లో ప్రాక్టీస్ చేసేవి. కానీ, బీసీసీఐ వారి మొత్తం ఆటను చెడగొట్టింది. ఇప్పుడు భవిష్యత్తులో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మనం చూడాల్సి ఉంటుంది.

ఫైనల్ మే 25న..

ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. కానీ, ప్రధాన తేదీలు వెల్లడయ్యాయి. మొదటి మ్యాచ్ మార్చి 21న, ఫైనల్ మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి. కాగా, రెండు ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..