AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs MI : ఆర్సీబీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. గెలిచామన్న ఆనందం లోపే భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే?

RCB vs MI : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని అభిమానులను ఖుషీ చేసింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉండగానే ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌కు చేదు వార్త ఎదురైంది.

RCB vs MI : ఆర్సీబీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. గెలిచామన్న ఆనందం లోపే భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే?
Rcb Vs Mi
Rakesh
|

Updated on: May 11, 2026 | 12:34 PM

Share

RCB vs MI : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని అభిమానులను ఖుషీ చేసింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉండగానే ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌కు చేదు వార్త ఎదురైంది. అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను ఆయనకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది.

వివాదానికి కారణమైన ఆ ఒక్క ఫోర్

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అసలు డ్రామా 18వ ఓవర్లో మొదలైంది. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కృనాల్ పాండ్యా కొట్టిన బంతిని ముంబై ఫీల్డర్ నమన్ ధీర్ బౌండరీ లైన్ వద్ద ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతను బౌండరీ లైన్‌ను తాకాడా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. థర్డ్ అంపైర్ చాలా సేపు రీప్లేలు చూసిన తర్వాత అది సిక్స్ కాదని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఆర్సీబీ క్యాంప్‌లో తీవ్ర అసహనాన్ని కలిగించింది.

హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా

అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, టీమ్ మెంటర్ దినేష్ కార్తీక్‌తో కలిసి ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆండీ ఫ్లవర్ కాస్త శ్రుతిమించి ప్రవర్తించారని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భావించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.3 ప్రకారం (అనుచిత భాష వాడటం) లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను ఆయన మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఆండీ ఫ్లవర్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ ఈ శిక్షను ఖరారు చేశారు.

నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి విజయం

ఒకవైపు డ్రామా నడుస్తున్నా, మైదానంలో ఆట మాత్రం అదిరిపోయింది. చివరి మూడు బంతుల్లో ఆర్సీబీకి 9 పరుగులు కావాల్సిన సమయంలో భువనేశ్వర్ కుమార్ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలవగా, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక
భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక
నోటికి అమృతంలా అనిపించే ఆంధ్ర టొమాటో చారు!
నోటికి అమృతంలా అనిపించే ఆంధ్ర టొమాటో చారు!
మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..
మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..