AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs AFG: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. టెస్ట్ క్రికెట్‌లోనే భారీ విక్టరీ.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్‌..

Bangladesh vs Afghanistan: ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది.

BAN vs AFG: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. టెస్ట్ క్రికెట్‌లోనే భారీ విక్టరీ.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్‌..
Venkata Chari
|

Updated on: Jun 17, 2023 | 2:02 PM

Share

Bangladesh vs Afghanistan: ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు 146 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత, బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ను కేవలం 115 పరుగులకే కట్టడి చేసి, 546 పరుగుల భారీ విజయాన్ని బంగ్లా టీం నమోదు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది మూడో అతిపెద్ద విజయంగా నిలిచింది.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మహ్మదల్ హసన్ 76 పరుగులు చేయగా, నంబర్ త్రీ బ్యాట్స్‌మెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 146 పరుగులతో సెంచరీ చేశాడు.

అదే సమయంలో ముష్ఫికర్ రహీమ్ 47, మెహందీ హసన్ మిరాజ్ 48 పరుగులు చేశారు. ఆ తర్వాత బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్ ఎబాదత్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీశాడు. మరోవైపు తైజుల్ ఇస్లాం, మెహందీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

112 ఏళ్ల నాటి రికార్డును బద్దలు..

టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ ఇప్పుడు మూడో అతిపెద్ద విజయం సాధించింది. ఈ రికార్డు జాబితాలో ఇంగ్లండ్ నంబర్ వన్ స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉన్నాయి. 1928లో ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో 1934లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..