AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: షాహీన్ అఫ్రిదికి బిగ్ షాక్.. పాకిస్తాన్ వైట్‌బాల్ కెప్టెన్‌గా ఆజామే..

Babar Azam Appointed Captain: పాకిస్థాన్ జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. టీ20, వన్డే జట్టుకు బాబర్‌ను కెప్టెన్‌గా బోర్డు నియమించింది. బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ బాబర్ ఆజంతో సమావేశమయ్యారు. నఖ్వీ సెలక్టర్లతో సమావేశమయ్యారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు రిటైరైన ఆటగాళ్లతో ఈ మీటింగ్ జరిగింది. కోచ్‌ల నియామకానికి సంబంధించి నఖ్వీ బాబర్ అజామ్, సెలెక్టర్లకు సలహా ఇస్తున్నాడు

Pakistan: షాహీన్ అఫ్రిదికి బిగ్ షాక్.. పాకిస్తాన్ వైట్‌బాల్ కెప్టెన్‌గా ఆజామే..
Babar Azam
Venkata Chari
|

Updated on: Mar 31, 2024 | 1:17 PM

Share

Babar Azam appointed captain: టీ20 ప్రపంచకప్‌నకు ముందు బాబర్ ఆజం మళ్లీ పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా మారాడు. షహీన్ షా ఆఫ్రిది కేవలం ఒక సిరీస్ తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించారు. పాకిస్థాన్ క్రికెట్‌పై షాహీన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా పాక్ క్రికెట్లో మసలం నడుస్తోంది. ఇది మాత్రమే కాదు, ఇమాద్ వసీం రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చాడు. వాసిమ్ యూ-టర్న్ తర్వాత, మొహమ్మద్ అమీర్ కూడా రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చాడు. కేవలం వారం వ్యవధిలోనే పాకిస్థాన్ క్రికెట్‌లో చాలా విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం నెలకొంది.

బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ బాబర్ ఆజంతో సమావేశమయ్యారు. నఖ్వీ సెలక్టర్లతో సమావేశమయ్యారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు రిటైరైన ఆటగాళ్లతో ఈ మీటింగ్ జరిగింది. కోచ్‌ల నియామకానికి సంబంధించి నఖ్వీ బాబర్ అజామ్, సెలెక్టర్లకు సలహా ఇస్తున్నాడు. అయితే, ఈ చిత్రాలలో షాహీన్ షా ఆఫ్రిది ఎక్కడా కనిపించలేదు. ఆదివారం ఉదయం వరకు పాకిస్థాన్ టీ20 కెప్టెన్ ఎవరు?

గత వారం రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ వార్తల్లో నిలుస్తోంది. వారం రోజుల్లో పాకిస్థాన్ క్రికెట్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

పాకిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్ ఏడు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. పీసీబీ అధికారులతో మాట్లాడిన తరువాత, రిటైర్మెంట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాను. అతను టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ తరపున టీ20 ప్రపంచకప్ ఆడాలని అనుకుంటున్నాడు. గతేడాది నవంబర్ 24న ఇమాద్ వసీమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

ఇమాద్ వాసిమ్ రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ కూడా రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చాడు. తనకు, పీసీబీ అధికారులకు మధ్య సానుకూల సంభాషణ జరిగిందని కూడా చెప్పారు. అతను టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉన్నాడని భావించాలని అన్నాడు.

బోర్డు పట్టించుకోకపోవడం పట్ల అఫ్రిది నిరాశ చెందాడని.. బోర్డుతో కమ్యూనికేషన్ లేకపోవడంతో అతను నిరాశకు గురయ్యాడని షాహీన్ అఫ్రిది సన్నిహితుడు ఇటీవల చెప్పారు. కోచ్‌ల నియామకం, టీ20 ప్రపంచకప్, పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన చర్చల్లో బాబర్ అజామ్‌ను పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేర్చుకోవడంపై అఫ్రిదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కేవలం ఒక సిరీస్ తర్వాత పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్సీని షాహీన్ అఫ్రిది నుంచి తొలగించింది. అఫ్రిది కెప్టెన్సీలో, పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడింది. అది 4-1 తేడాతో ఓడిపోయింది.

పాకిస్థాన్ జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. టీ20, వన్డే జట్టుకు బాబర్‌ను కెప్టెన్‌గా బోర్డు నియమించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..