
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) లో ఆడుతున్నాడు. తన బ్యాట్‌తో పెను తుఫాను సృష్టిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. శుక్రవారం పీఎస్‌ఎల్‌లో ఆజం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇస్లామాబాద్ యునైటెడ్ క్వైట్ గ్లాడియేటర్స్‌తో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన ఆజామ్ ఫోర్లు, సిక్స్‌లతో పెను విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ మొత్తంలో 42 బంతులు ఎదుర్కొన్న అతను 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 97 రన్స్ చేసి త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. మ్యాచ్‌లో ఆజాం స్ట్రైక్ రేట్ 230కు పైగా ఉందంటే అతనెంతలా విధ్వంసం సృష్టించాడో ఇట్టే అర్థమవుతోంది. ఆజామ్‌తో పాటు కివీస్ బ్యాటర్ కోలీన్ మన్రో (38), పాక్ క్రికెటర్ అసిఫ్ అలీ (42) రాణించడంతో ఇస్లామాబాద్ భారీస్కోరు చేసింది. క్వైట్ గ్లాడియేటర్స్ బౌలర్లలో మహ్మద్ హస్నైన్, ఓడియన్ స్మిత్ తలా 2 వికెట్లు తీశారు. భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ 19.1 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇస్లామాబాద్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫరూఖీ, హసన్ అలీ తలా 3 వికెట్లతో రాణించారు.
కాగా పీఎస్‌ఎల్‌కు ముందు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా అజామ్ ఆడాడు. ఈ లీగ్‌లో, అతను ఖుల్నా టైగర్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో భాగంగా జనవరి 9, 2023న చటోగ్రామ్ ఛాలెంజర్స్‌పై సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అజామ్ 58 బంతుల్లో 109 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. అతని టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. అజమ్ ఇప్పటివరకు పాకిస్థాన్ తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే పెద్దగా రాణించలేకపోయాడు. కాగా చూడడానికి భారీ కాయంతో కనిపించే ఈ యంగ్ క్రికెటర్‌ను తోటి క్రికెటర్లే గేలి చేశారు. ముఖ్యంగా పాక్ ఓవర యాక్షన్ బౌలర్‌గా పేరొందిన నసీమ్‌షా ఇటీవల ఆజాంను వెక్కిరిస్తూ వార్తల్లో నిలిచాడు.
When you make your dad proud ?#SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/9sVWHkOByQ
— PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..