Sean Abbott: కన్నబిడ్డ సమక్షంలో ప్రేయసిని పెళ్లాడిన సన్‌రైజర్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌.. నెట్టింట్లో వైరల్‌ ఫొటోలు..

Sean Abbott Wedding: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్‌బౌలర్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ సీన్ అబాట్ (Sean Abbott ) ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి, బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ నీల్‌ (Brier Neilతో ఏడడుగులు నడిచాడు అబాట్‌.

Sean Abbott: కన్నబిడ్డ సమక్షంలో ప్రేయసిని పెళ్లాడిన సన్‌రైజర్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌.. నెట్టింట్లో వైరల్‌ ఫొటోలు..
Sean Abbott

Updated on: Sep 09, 2022 | 6:36 PM

Sean Abbott Wedding: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్‌బౌలర్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ సీన్ అబాట్ (Sean Abbott ) ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి, బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ నీల్‌ (Brier Neilతో ఏడడుగులు నడిచాడు అబాట్‌. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. కాగా తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన చిన్నారి సమక్షంలో అబాట్‌, ప్రియర్‌ పెళ్లిపీటలెక్కడం విశేషం. కాగా తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీన్‌ అబాట్ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారాయి.

నా ప్రేమను పెళ్లాడాను..

ఇవి కూడా చదవండి

‘నా ప్రేమను నేను పెళ్లాడాను. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ బ్రియర్‌ అబాట్‌! స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా జీవితంలోని ప్రత్యేక వేడుక ఇలా జరిగింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అబాట్‌. కాగా ఐపీఎల్‌-2022లో అతను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వివాహ వేడుక సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా అబాట్‌ దంపతులకు విషెస్‌ చెప్పింది సన్‌రైజర్స్‌ యాజమాన్యం. అబాట్‌ 2014లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్‌ తరఫున 5 వన్డేలు, ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఆ సంఘటనతో..

ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత విషాదంగా  ఆస్ట్రేలియా ప్లేయర్ ఫిలిప్ హ్యూస్ మరణం మిగిలిపోయింది. సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ తగిలే ఫిలిప్ హ్యూస్ మరణించాడు. అబాట్ ఉద్దేశపూర్వకంగా ఆ బౌన్సర్ వేయకున్నా.. నేరుగా హ్యూస్ మెడకు బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు హ్యుస్‌. ఇది సీన్ అబాట్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టింది. కొన్నాళ్లపాటు ఆ ఘటన వేధించడంతో అతను క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకొని మళ్లీ మైదానంలోకి దిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..