Australia Vs Sri Lanka: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) భారీ సిక్సర్ కొట్టాడు. ఎంత బలంతో కొట్టాడో గానీ ఆ బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది. కమిన్స్ కొట్టిన ఈ షాట్ ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అందరినీ విస్మయానికి గురి చేసింది. స్టేడియంలోని అభిమానులు సైతం నోరెళ్లబెట్టారు. వార్నీ.. ఇదేం బాదుడురా అయ్యా.. అని అందరూ అవాక్కయ్యారు. ఐపీఎల్‌లో కోల్‌కతానైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఆల్‌రౌండర్ ఈ సీజన్‌లోనూ కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. అందులో ముంబైపై ఏకంగా 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన అదుర్స్ అనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే..శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఖవాజా (71), కెమరూన్ గ్రీన్ (77) అర్ధ సెంచరీలతో రాణించారు. అలెక్స్ క్యారీ 47 బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కమిన్స్ ఇన్నింగ్స్ లో మొత్తం 3 సిక్సర్లు ఉన్నాయి. అందులో ఓ సిక్సర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. లంక బౌలర్ జెఫ్రీ వాండర్ సే బౌలింగ్ లో బాదిన బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది.
Who’s going to find the ball Pat Cummins just hit out of Galle? ? #SLvAUS pic.twitter.com/BBSuoiJFm3
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) June 30, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..