భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణ గండం.. గబ్బాలో ఉరుములతో కూడిన భీకర వర్షం పడే ఛాన్స్..

భారత్-ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్ చివరి రోజుకు వరుణుడు అడ్డంకిగా మారనున్నాాడు. మంగళవారం గబ్బాలో ఉరుములతో కూడిన భీకర వర్షం పడే అవకాశం ఉందని..

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణ గండం.. గబ్బాలో ఉరుములతో కూడిన భీకర వర్షం పడే ఛాన్స్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 19, 2021 | 6:07 AM

Australia vs India : భారత్-ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్ చివరి రోజుకు వరుణుడు అడ్డంకిగా మారనున్నాాడు. మంగళవారం గబ్బాలో ఉరుములతో కూడిన భీకర వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

చివరి టెస్టులో 328 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్​కు ఆదిలోనే వర్షం అడ్డు తగిలింది. అయితే మంగళవారం కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. గబ్బాలో మంగళవారం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ వెదర్ రిపోర్టులో పేర్కొంది.

ప్రస్తుత బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆశలను సజీవంగా భారత్​ నిలబెట్టుకోవాలంటే.. ఆఖరి టెస్టులో గెలిచినా లేదా డ్రా చేసినా సరిపోతుంది. కానీ ఆసీస్​ దక్కించుకోవాలంటే మాత్రం కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అయితే అందుకు చివరి రోజు పూర్తిగా ఆడాల్సింది.

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటై భారత్​ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్​‌ను ప్రారంభించిన టీమిండియా.. 4/0తో నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో చెరో విజయం సాధించిన ఇరు జట్లు మూడో మ్యాచ్​ మాత్రం డ్రాగా ముగించాయి.