AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs SA: ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే ఛాన్స్?

ODI World Cup 2023: ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను భారత్‌తో ఆడింది. తొలి మ్యాచ్‌లోనూ ఆ జట్టు టాప్ ఆర్డర్ దాదాపు బలహీనంగానే కనిపించింది. స్టీవ్ స్మిత్ 46 పరుగులతో, డేవిడ్ వార్నర్ 41 పరుగులతో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, ఇద్దరు బ్యాట్స్‌మెన్ దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమయ్యారు. కాగా, మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

AUS vs SA: ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే ఛాన్స్?
Australia Squad
Venkata Chari
|

Updated on: Oct 12, 2023 | 9:20 PM

Share

ODI World Cup 2023, Australia’s Top Order: ఆస్ట్రేలియా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ప్రపంచ కప్ 2023లో రెండవ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలహీనంగా తయారైంది. సౌతాఫ్రికా బౌలర్ల ముందు అట్టర్ ఫ్లాప్ అయింది. ముఖ్యంగా జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా నీరుగారిపోయింది. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. 312 పరుగుల భారీ స్కోరును ఛేదించడానికి ఆస్ట్రేలియా మైదానంలోకి వచ్చింది. అయితే జట్టు బ్యాటింగ్ చాలా పేలవంగా మారడంతో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో చిక్కుంది.

టాప్ ఆర్డర్ విఫలం..

మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మార్ష్ జట్టు స్కోర్ 27 పరుగుల వద్ద కేవలం 7 పరుగులు (15 బంతులు) చేసి ఆరో ఓవర్ ఐదో బంతికి ఔట్ అయ్యాడు. ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ మార్కో జెన్సన్ చేతిలో ఆస్ట్రేలియా ఓపెనర్ చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్ చివరి బంతికి, రెండో ఎడమచేతి వాటం ఓపెనర్ డేవిడ్ వార్నర్ పెవిలియన్ బాట పట్టాడు. వార్నర్ (13) ఆఫ్రికన్ పేసర్ లుంగీ ఎన్గిడి చేతికి చిక్కాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

తర్వాత మూడో స్థానంలో వచ్చిన స్టీవ్ స్మిత్ 19 (16) పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ముగించాడు. 10వ ఓవర్ చివరి బంతికి స్మిత్ వికెట్ కోల్పోయాడు. ఈ విధంగా 50 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియాకు మూడో దెబ్బ తగిలి జట్టు టాప్ ఆర్డర్ పెవిలియన్ బాట పట్టింది.

భారత్‌పై కూడా టాప్ ఆర్డర్ విఫలం..

View this post on Instagram

A post shared by ICC (@icc)

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను భారత్‌తో ఆడింది. తొలి మ్యాచ్‌లోనూ ఆ జట్టు టాప్ ఆర్డర్ దాదాపు బలహీనంగానే కనిపించింది. స్టీవ్ స్మిత్ 46 పరుగులతో, డేవిడ్ వార్నర్ 41 పరుగులతో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, ఇద్దరు బ్యాట్స్‌మెన్ దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమయ్యారు. కాగా, మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. స్మిత్, వార్నర్ లు స్పిన్నర్ల వలలో చిక్కుకున్నారు. కాగా, మార్ష్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేతికి చిక్కాడు. తద్వారా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ విఫలమైంది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us