ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే మొదటి టెస్టులో చిత్తైన పాక్ తాజాగా రెండో టెస్టులోనూ ఓటమి పాలైంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే ఎప్పటిలాగే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తమ వంకర బుద్ధిని చాటుకున్నారు. పేలవమైన ఆటతీరును ప్రదర్శించిన తమ ఆటగాళ్లను ప్రశ్నించకుండా అంపైరింగ్‌పై సందేహాలు లేవనెత్తారు. రెండో టెస్టు మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ కోచ్ మహ్మద్ హఫీజ్ డీఆర్‌ఎస్‌పై ప్రశ్నలు సంధించాడు. హఫీజ్ డీఆర్‌ఎస్‌ని చెత్త టెక్నాలజీ అని పేర్కొంటూ అంపైరింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే..ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఔట్ చర్చనీయాంశమైంది. పాట్ కమిన్స్ వేసిన బంతి రిజ్వాన్ బ్యాట్ సమీపంగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు అప్పీల్ చేసింది. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ తిరస్కరించారు. ఆస్ట్రేలియా రివ్యూ తీసుకుంది. థర్డ్ అంపైర్, స్నికోమీటర్ సహాయంతో, బంతి రిజ్వాన్ రిస్ట్ బ్యాండ్‌కు తగిలిందని నిర్ధారించి రిజ్వాన్‌ను ఔట్‌గా ప్రకటించాడు.
అయితే మ్యాచ్ అనంతరం రిజ్వాన్ ఔట్‌పై హఫీజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని అంగకీరిస్తూనే అంపైరింగ్‌లో లోపాలు ఉన్నాయన్ఆనడు. అలాగే డీఆర్‌ఎస్ టెక్నాలజీలో లోపాలు కారణంగా చాలా త్వరగా మ్యాచ్ ఫలితాలు మారిపోతున్నాయన్నాడీ పాక్ మాజీ కెప్టెన్. దీనిపై ఐసీసీ దృష్టి సారించాల్సి ఉందని, ఒక్కోసారి ఇదేదో టెక్నాలజీ షో అని అనిపిస్తోందని, క్రికెట్ ఆడటం అనించడం లేదని హఫీజ్ అన్నాడు. తమ జట్టు మెరుగ్గా క్రికెట్ ఆడిందని, అందుకు తాను గర్వపడుతున్నానన్నాడు హఫీజ్. ఈ విషయంపై వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిజ్వాన్ తో మాట్లాడినట్లు హఫీజ్ తెలిపాడు. రిజ్వాన్ చాలా నిజాయితీపరుడని, బంతి అతని గ్లోవ్స్‌కు కూడా దగ్గరగా లేదని చెప్పాడు. మైదానంలోని అంపైర్ నిర్ణయాన్ని రద్దు చేసేందుకు పక్కా ఆధారాలు ఉండాలని హఫీజ్ అన్నాడు. రిజ్వాన్ విషయంలో ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేవని, దాని ఆధారంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చాలని చెప్పాడు. సాంకేతికత సాయం కాకుండా శాపంగా మారిందని విమర్శలు చేస్తాడు.
Test cricket, there is simply NOTHING like it!
An incredible day for our Aussie men as they secured the Boxing Day Test, and the series against Pakistan. Bring on Sydney!
Get your tickets to The Pink Test here: https://t.co/G8wMgQpIEM pic.twitter.com/YkGCctRxIc
— Cricket Australia (@CricketAus) December 29, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..