Virat Kohli: కోహ్లీపై ఒక్కసారిగా పెరిగిన అంచనాలు.. అందని ద్రాక్షపై ఫ్యాన్స్ ఆశలు..

Virat Kohli: కోహ్లీపై ఒక్కసారిగా పెరిగిన అంచనాలు.. అందని ద్రాక్షపై ఫ్యాన్స్ ఆశలు..
Virat Kohli

ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లలో 19.66 సగటుతో 236 పరుగులు చేశాడు. అలాగే 113.46 స్ట్రైక్ రేట్‌ సాధించాడు. మొత్తం 13 ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వైఫల్యాలను కూడా నమోదు చేశాడు. ఇందులో మూడు గోల్డెన్ డక్‌లు కూడా ఉన్నాయి.

Shaik Madarsaheb

| Edited By: Subhash Goud

May 24, 2022 | 1:52 PM

బ్యాడ్ ఫాంతో విమర్శల పాలయ్యాడు.. రెండేళ్లుగా మూడంకెల స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడంటూ ఎగతాళి చేశారు. అలాగే ఐపీఎల్ 2022లోనూ అదే ఫాంతో తడబాటు పడ్డాడు. కానీ, తన టీం చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం జట్టును గెలిపించి, హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని, ఫాంలోకి వచ్చినట్లు హింట్ ఇచ్చాడు. ఆయనెవరో కాదు.. టీమిండియా మాజీ సారథి, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(RCB) ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. అసమానతలతోపాటు ప్రతికూలతలను ధిక్కరించి కేవలం 54 బంతుల్లో 73 పరుగులతో అద్భుతమైన ఛేజింగ్‌ చేసి, తన జట్టును ప్లే ఆఫ్ లిస్టులో చేరాడు. గురువారం – మే 19న వాంఖడే స్టేడియంలో టేబుల్ టాపర్స్ లిస్టులో నిలిచిన గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన టైంలో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి కోహ్లీ సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని స్టాండ్‌పై ఆధిపత్యం చెలాయించాడు.

ఈ మ్యాచ్‌లో అపారమైన ఒత్తిడితో బరిలోకి దిగి, వెరీ వెరీ స్సెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, ఛాంపియన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లతో కూడిన బౌలింగ్ లైనప్‌పై విరాట్ కోహ్లి ధీటుగా ఆడుతూ, తన జట్టు కోసం డూ ఆర్ డై ఎన్‌కౌంటర్‌లో విజయం సాధించాడు. గతంలో 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్న కోహ్లీ.. జీటీ స్పిన్నర్‌ రషీధ్ ఖాన్‌పై 12 బంతుల్లో 24 పరుగులు చేసి పైచేయి సాధించాడు. ఈ క్రమంలో కోహ్లి తన ఫ్రంట్ లెగ్‌ని క్లియర్ చేసి, లెగ్ స్పిన్నర్‌ను డీప్ మిడ్-వికెట్ స్టాండ్‌లోకి ఫ్లిక్-విప్ చేసి అర్ధ సెంచరీని నమోదు చేసి, ఆశలు నిలిపాడు.

ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లలో 19.66 సగటుతో 236 పరుగులు చేశాడు. అలాగే 113.46 స్ట్రైక్ రేట్‌ సాధించాడు. మొత్తం 13 ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వైఫల్యాలను కూడా నమోదు చేశాడు. ఇందులో మూడు గోల్డెన్ డక్‌లు కూడా ఉన్నాయి. కాగా, టోర్నమెంట్‌లో అతని జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో మాత్రం పరుగుల వరద పారించి, సత్తా చాటాడు. ఐపీఎల్ టోర్నమెంట్ చివరి మూడు సీజన్‌లలో అతని అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకదాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ కోహ్లీకి పునరుజ్జీవనాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2019 నవంబర్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసినప్పటి నుంచి కోహ్లి భారతదేశం తరపున చెత్త ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఇదే కాలంలో టెస్టు క్రికెట్‌లో 17 మ్యాచ్‌లలో 28.03 సగటుతో కేవలం 841 పరుగులు చేసి, బోల్తా పడ్డాడు. ఆగస్టు 2017 తర్వాత అతని బ్యాటింగ్ సగటు మొదటిసారి 50 కంటే తక్కువకు పడిపోయింది.

ఇదే సమయంలో కోహ్లి వన్డే రికార్డు కూడా కేవలం 37.66 సగటుతో దిగువకు చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను ఇతర రెండు ఫార్మాట్లలో అంటే, ఐపీఎల్‌తోపాటు, టీంఐలలో మాత్రం అత్యుత్తమంగా ఉన్నాయి. ఈ కాలంలో అంతర్జాతీయ T20I క్రికెట్‌లో కోహ్లీ 22 ఇన్నింగ్స్‌లలో 56.4 సగటు, 145.11 స్ట్రైక్ రేట్‌తో 846 పరుగులు సాధించాడు.

ఇలాంటి బ్యాడ్ టైంలో మూడు ఫార్మాట్లలో ఒకదానిని వదులుకోవాలని చాల మంది సలహాలు ఇచ్చారు. రెడ్-బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలంటూ సూచించారు. అలాగే నవంబర్‌లో జరగనున్న మెగా టోర్నమెంట్‌ అంటే T20 ప్రపంచ కప్ జట్టులో భాగం కాకూడదని కొందరు వాదించారు. కోహ్లి ఆట నుంచి కొంత విరామం తీసుకోవాలని, ఇదే సమయంలో సరికొత్తగా తిరిగి రావాలని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ, టైటాన్స్‌పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనను అందించిన కోహ్లి, RCBని ఫైనల్‌కు చేర్చడమే కాక, మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ గెలవాలని కోరకుంటున్నాడు. అలాగే స్వదేశీ సిరీస్‌లో భారతదేశం తరపున అనేక మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

పూణేలో ఏప్రిల్ 26న జరిగిన మ్యాచ్‌లో దారుణ ప్రదర్శనతో ఒక్కాసారిగా విమర్శల పాలైయ్యాడు. సరిగ్గా మూడు వారాల తర్వాత, అతను తన విమర్శకులను నిశ్శబ్దంలోకి చేర్చాడు. కోహ్లీ ఇప్పటికీ అతిపెద్ద వేదికపై ఉన్నాడని ప్రపంచానికి తనకు తానుగా ప్రదర్శించుకునే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్‌లో ఇలాంటి ఇన్నింగ్సే ఆడి సత్తా చాటుతాడని అంతా ఆశిస్తున్నారు. బ్యాడ్ ఫాం అనేది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. కానీ, ఓ దిగ్గజ ఆటగాడిగా తనను తాను నిరూపించుకోవడం మాత్రం కీలకం. రానున్న రోజుల్లో కోహ్లీ తన వైఫల్యాను సరిదిద్దుకొని అద్భుతమైన తన ఫాంను కొనసాగిస్తాడేమో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu