Watch Video: దిగ్గజానికి షాకిచ్చిన 15 ఏళ్ల బౌలర్.. 12 ఓవర్ల మ్యాచ్‌లో 4 వికెట్లతో దూకుడు.. వైరల్ వీడియో..
12 ఓవర్ల మ్యాచ్‌లో అద్భుతం చేసిన బౌలర్.. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ అలిస్టర్ కుక్‌తోపాటు కీలక వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
ఆ బౌలర్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు. అంటే ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ అలిస్టర్ కుక్ టెస్టు అరంగేట్రం చేసేటప్పటికి అతడు పుట్టలేదు. కానీ, ఈ 15 ఏళ్ల బౌలర్ అలిస్టర్ కుక్(Alastair Cook)తో మొదటిసారి మ్యాచ్‌లో తలపడ్డాడు. ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ వికెట్‌ను దెబ్బతీసేందుకు 15 నిమిషాల సమయం కూడా తీసుకోలేదు. కుక్‌కి 15 పరుగులు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. మరో 12 ఓవర్ల మ్యాచ్ మాత్రమే ఉంది. కానీ, ఇందులో అతను తన బౌలింగ్ నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించాడు. కుక్ ముందు తనలోని క్రికెట్ ప్రతిభను చాటుకున్నాడు. కుక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన విధానంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాక్‌కు గురయ్యాడు. పోటాన్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో అలిస్టర్ కుక్ బెడ్‌ఫోర్డ్‌షైర్ ఫార్మర్స్ క్లబ్ తరపున ఆడాడు. అతను ఈ క్లబ్ కోసం ప్రతి సంవత్సరం ఆడతాడు.
కుక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన 15 ఏళ్ల బౌలర్..
12 ఓవర్ల మ్యాచ్ ఈ మ్యాచ్‌లో బెడ్‌ఫోర్డ్‌షైర్ క్లబ్ 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అయితే ఇందులో కుక్ సహకారం కేవలం 15 పరుగులు మాత్రమే. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. కానీ అతను భారీ ముప్పుగా మారకముందే, ప్రత్యర్థి జట్టు తరపున ఆడుతున్న 15 ఏళ్ల బౌలర్ కీరన్ షాకిల్టన్ భారీ షాక్ ఇచ్చాడు..
12 ఓవర్ల మ్యాచ్‌లో 4 వికెట్లు..
కుక్ వికెట్ తీసిన తర్వాత ఆ 15 ఏళ్ల బౌలర్ తన దూకుడు మరింత పెంచాడు. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. అంతకు మించి చాలా వికెట్లు తీశాడు. బెడ్‌ఫోర్డ్‌షైర్ క్లబ్‌లో పడిన 7 వికెట్లలో 4 ఈయన తిసినవే. 15 ఏళ్ల కిరన్ షాకిల్టన్ 4-37 గణాంకాలను సాధించాడు. అలిస్టర్ కుక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. తద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 15000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా మారాడు.
Sir Alastair Cook made his annual appearance for Bedfordshire Farmers CC this evening.
He was clean bowled by 15-year-old Kyran Shackleton, who wasn’t even born when Cook made his Test debut.
Brilliant scenes at @PottonTownCC ? pic.twitter.com/8yhB5WvsRJ
— Cricket District ? (@cricketdistrict) May 23, 2022