IPL 2022: 14 మ్యాచ్‌లు.. 120 స్ట్రైక్‌రేట్‌.. బ్యాడ్‌ఫాంకి కేరాఫ్ అడ్రస్.. 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో చెత్త రికార్డు..

రోహిత్ శర్మ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అయితే ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే రోహిత్ IPLలో ఈ సీజన్‌లో ఓ చెత్త రికార్డులో చేరాడు.

IPL 2022: 14 మ్యాచ్‌లు.. 120 స్ట్రైక్‌రేట్‌.. బ్యాడ్‌ఫాంకి కేరాఫ్ అడ్రస్.. 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో చెత్త రికార్డు..
Ipl 2022 Rohit Sharma
Follow us

|

Updated on: May 22, 2022 | 8:36 PM

రోహిత్ శర్మ.. పరిమిత ఓవర్ల ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. క్లాస్, టెక్నిక్ ఎంతో బాగుంటుందంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కాదు.. రోహిత్ కెప్టెన్సీ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. తన కెప్టెన్సీలో ఐదుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కిరీటాన్ని ముంబై ఇండియన్స్‌కు అందించాడు. అయితే, ఐపీఎల్-2022కు ముందు ఎప్పుడూ జరగని ఓ చెత్త రికార్డులో రోహిత్ శర్మ చేరాడు. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. ఓటమితో మొదలైన ఈ జట్టు విజయంతో ఈ సీజన్‌ను ముగించగలిగినప్పటికీ రోహిత్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.

ఈ సీజన్‌లో రోహిత్ పరుగుల కోసం చాలా కష్టపడ్డాడు. ఓపెనర్‌గా చాలా మ్యాచ్‌ల్లో జట్టుకు ఆశించిన ఆరంభాన్ని అందించలేకపోయాడు. వరుసగా ఫెయిల్ అవుతూ రోహిత్ నుంచి ఎవరూ ఊహించని రికార్డులో చేరిపోయాడు.

మొదటిసారి ఇలా..

ఇవి కూడా చదవండి

ఈ సీజన్‌లో రోహిత్‌ బ్యాట్‌ నుంచి పరుగులు రాలేదు. ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. రోహిత్ ఐపీఎల్‌లో ఆడి ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 48 పరుగులు మాత్రమే. ఈ సీజన్‌లో రోహిత్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాడు. 19.14 సగటుతో కేవలం 268 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 120.18గా నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్‌లన్నింటిని పరిశీలిస్తే.. ఈ సీజన్‌లో రోహిత్ అతి తక్కువ పరుగులు చేశాడు. అంతకుముందు, అతను 2018 సీజన్‌లో 286 పరుగులు చేశాడు. అయితే అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈసారి రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. అతను ఖచ్చితంగా ఈ సీజన్‌ను మరచిపోవాలనుకుంటున్నాడు.

కోహ్లి రెండు అర్ధ సెంచరీలు..

రోహిత్ లాగే విరాట్ కోహ్లి ఫామ్ కూడా ఈ సీజన్ లో ఫర్వాలేదు. అతను పరుగుల కోసం కష్టపడటం కూడా కనిపించింది. ఈ సీజన్‌లో కోహ్లీ తొలి బంతికే ఖాతా తెరవకుండానే మూడుసార్లు ఔటయ్యాడు. అయితే కోహ్లీ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌పై ఈ రెండు అర్ధశతకాలు సాధించాడు. కానీ ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా రోహిత్ బ్యాట్ 50 మార్కును దాటలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌లో కోహ్లీ సేన ఉంది. ఇటువంటి పరిస్థితిలో, అతని బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also Read: SRH vs PBKS Playing XI IPL 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

IPL 2022: ముంబై గెలుపుతో సంబురాలు చేసుకున్న ఆర్‌సీబీ ఆటగాళ్లు.. డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..